News August 31, 2024

కొత్తగా నిర్మించిన రైల్వేట్రాక్‌ల దూరం 14,985 KM

image

దేశంలో 2014-2024 మధ్య 14,985 KM మేర రైల్వే ట్రాక్‌లను నిర్మించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇది ఫ్రాన్స్ లాంటి ధనిక దేశం కంటే అధికమన్నారు. ఇక గంటకు 100 కిమీ వేగంతో నడిచే అమృత్ భార‌త్ రైళ్ల‌లో 1500 KM దూరానికి కేవ‌లం రూ.450 ఖ‌ర్చ‌వుతుంద‌ని పేర్కొన్నారు. వందే భార‌త్ రైళ్లలో విమానాల కంటే 100 రెట్లు త‌క్కువ శ‌బ్దం ఉంటుంద‌ని తెలిపారు. ఈటీ వ‌ర‌ల్డ్ లీడ‌ర్స్ స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడారు.

Similar News

News September 17, 2025

హీరోయిన్ ఇంటిపై కాల్పులు.. నిందితుల ఎన్‌కౌంటర్

image

హీరోయిన్ దిశా పటానీ <<17692512>>ఇంటిపై<<>> కాల్పుల కేసులో నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. UPలోని ఘజియాబాద్‌లో వారిని పట్టుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నిందితులు అరుణ్, రవీంద్ర మరణించారని పోలీసులు తెలిపారు. నిందితులు గోల్డీ బ్రార్ గ్యాంగ్ సభ్యులని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని అగౌరవపరిచినందుకు హీరోయిన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లు వారు వెల్లడించిన సంగతి తెలిసిందే.

News September 17, 2025

యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు

image

TG: రాష్ట్రంలో <<17740234>>ఆరోగ్యశ్రీ<<>> సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. 87 శాతం హాస్పిటళ్లు పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తుండగా, కేవలం 13 శాతం హాస్పిటళ్లలోనే సేవలు ఆగాయని పేర్కొన్నారు. వైద్య సేవలు కొనసాగించాలని ఆరోగ్యశ్రీ CEO ఉదయ్ కుమార్ మరోసారి ఆయా ఆస్పత్రులకు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద గత 2 వారాలుగా సగటున రోజుకు 844 సర్జరీలు నమోదవగా ఈరోజు 799 సర్జరీలు నమోదయ్యాయని వెల్లడించారు.

News September 17, 2025

పాకిస్థాన్‌తో మ్యాచ్.. యూఏఈ బౌలింగ్

image

ఆసియాకప్‌లో పాకిస్థాన్ ఆడటంపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. యూఏఈతో మ్యాచులో టాస్ కోసం ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ మైదానంలోకి వచ్చారు. టాస్ గెలిచిన యూఏఈ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు సూపర్-4 చేరనుంది.