News October 7, 2025
పైడితల్లి అమ్మవారి దివ్యగాథ

విజయనగరానికి రాజైన తన సోదరుడు విజయరామరాజును బొబ్బిలి యుద్ధానికి వెళ్లొద్దని పైడితల్లమ్మ ముందే చెబుతారు. కానీ ఆమె మాట వినక రాజు యుద్ధానికెళ్లి మరణిస్తాడు. ఈ కబురు తెలిసి అమ్మవారు కూడా తనువు చాలిస్తారు. అదే రాత్రి పతివాడ అప్పలనాయుడు కలలోకి వచ్చిన అమ్మవారు తన ప్రతిరూపాలు లభించే స్థలాన్ని సూచిస్తారు. వాటిని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించమని చెబుతారు. ఆ విగ్రహాలు నిజంగానే లభ్యమవ్వగా, ఆలయాన్ని నిర్మించారు.
Similar News
News October 7, 2025
RTCలో ఉద్యోగాలు.. ముఖ్య గమనిక

TGSRTCలో డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. SC అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాలు వర్గీకరణ ప్రకారం (గ్రేడ్-1,2,3) కొత్త ఫార్మాట్‌లో ఉండాలని అధికారులు తెలిపారు. కొత్త సర్టిఫికెట్‌ను సకాలంలో పొందలేకపోతే, అందుబాటులో ఉన్న SC సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయవచ్చని చెప్పారు. అయితే, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో కొత్త ఫార్మాట్ కచ్చితంగా చూపించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు ఇక్కడ <
News October 7, 2025
AI నటి టిల్లీ గురించి తెలుసా?

ప్రస్తుతం హాలీవుడ్‌లో ఎక్కడ చూసినా నటి టిల్లీ గురించే చర్చ. ఆమె ప్రత్యేకత ఏంటా అనుకుంటున్నారా..టిల్లీ హైపర్ రియల్ ఏఐ నటి. త్వరలోనే టిల్లీ గొప్ప నటిగా మారబోతుందని ఈమె సృష్టికర్త, నిర్మాత, నటి అయిన ఎలైన్ వాన్ డెర్ వెల్డెన్ చెబుతున్నారు. ఈమె నిర్వహించే ఏఐ ప్రొడక్షన్ స్టూడియో- పార్టికల్ 6 తొలి సృష్టి టిల్లీ. ఏఐ కమిషనర్ కామెడీ స్కెచ్ వీడియోలో టిల్లీ కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించింది.
News October 7, 2025
పోషకాల పశువుల మేత ‘అవిశ’

అవిశ ఆకులు పశువులకు ముఖ్యంగా పాలిచ్చే వాటికి, మేకలకు అద్భుతమైన ఆహారమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అవిశ ఆకుల్లో 25-30 శాతం ప్రొటీన్లు ఉంటాయి. పశువులకు సులభంగా జీర్ణమయ్యే మేత ఇది. పశువులు అవిశ ఆకులను చాలా ఇష్టంగా తిని అధిక పాల దిగుబడినిస్తాయి. అవిశ పిండి(అవిశ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థం)ని కూడా పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. దీనిలో ప్రొటీన్లు, పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.