News October 10, 2025

దివ్యశబ్దరాశులే వేద మంత్రాలు

image

దివ్యబల సంపన్నులైన వేద కాలం నాటి రుషులు తమ ఆధ్యాత్మిక జ్ఞాన సంపదతో దర్శించిన దివ్య శబ్దరాశులే ‘వేద మంత్రాలు’. ఈ రుషులు వేదద్రష్టలే(వేదాలను చూసినవారు) కానీ రచయితలు కాదు. అందుకే వేదాలను శ్రుతులంటారు. అయితే వేద మంత్రాలను స్వరబద్ధంగానే వల్లె వేయాలి. లేకుంటే అనర్థాలు సంభవిస్తాయి. లోకాసమస్తా సుఖినోభవంతు అని అన్ని లోకాలు సుఖంగా ఉండాలి అంటుంది వేదం. <<-se>>#VedikVibes<<>>

Similar News

News October 10, 2025

నోబెల్ అందుకున్న భారతీయులు వీరే..

image

నోబెల్ శాంతి-2025 <<17966688>>మరియాను<<>> వరించింది. ఇప్పటివరకు నోబెల్ అందుకున్న భారతీయులు ఎవరంటే..
* ఠాగూర్-లిటరేచర్(1913), * సీవీ రామన్-ఫిజిక్స్(1930), * హరగోవింద్ ఖొరానా-ఫిజియాలజీ(1968), * మథర్ తెరెసా-శాంతి(1979), * సుబ్రమణ్యన్ చంద్రశేఖర్-ఫిజిక్స్(1983), * అమర్త్యసేన్-ఎకనామిక్ సైన్స్(1998), * వెంకట్రామన్ రామకృష్ణన్-కెమిస్ట్రీ(2009), * కైలాశ్ సత్యార్థి-శాంతి(2014), * అభిజిత్ బెనర్జీ-ఎకనామిక్ సైన్స్(2019)

News October 10, 2025

4 లక్షల మందిని రేప్ చేసిన పాక్ ఆర్మీ!

image

1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ టైమ్‌లో పాక్ ఎన్నో అకృత్యాలకు పాల్పడిందని UN వేదికగా భారత్ సంచలన విషయాలు వెల్లడించింది. నాడు 4 లక్షల మంది బంగ్లా మహిళలను పాక్ దళాలు రేప్ చేసినట్లు చెప్పింది. ‘Op సెర్చ్ లైట్’ పేరుతో మారణహోమం చేసిన పాక్ సైన్యం ఓ ప్లాన్ ప్రకారం సామూహిక అత్యాచారాలకు దిగిందని తెలిపింది. భారత్‌కు లొంగిపోయే దాకా దారుణాలు కొనసాగాయని, తీవ్రమైన లైంగిక హింసగా చరిత్రలో ఇది నిలిచిందని పేర్కొంది.

News October 10, 2025

కాఫ్ సిరప్ డెత్స్‌పై పిల్.. కొట్టేసిన సుప్రీంకోర్టు

image

దగ్గు మందు తాగి 20మందికి పైగా చిన్నారులు చనిపోయిన ఘటనపై దాఖలైన పిల్‌ను SC కొట్టేసింది. CBI దర్యాప్తు చేయాలని, డ్రగ్ సేఫ్టీపై రివ్యూ నిర్వహించాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. విచారణ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్ మెహతా అభ్యంతరం తెలిపారు. ఆయా రాష్ట్రాలు ఈ కేసు విచారణ జరుపుతున్నాయని చెప్పారు. CBIతో దర్యాప్తు అవసరం లేదన్నారు. దీంతో CJIతో కూడిన ధర్మాసనం పిల్‌ను డిస్మిస్ చేసింది.