News January 29, 2025
చెదిరిపోతున్న భారత విద్యార్థుల కల?

అమెరికాలో పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ పట్టుబడితే వీసా రద్దు చేస్తామని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో భారత విద్యార్థుల ఆశలు అడియాశలవుతున్నాయి. దాదాపు 3 లక్షల మంది భారత విద్యార్థులు అయోమయంలో పడిపోయారు. చదువుకునేందుకు డబ్బు లేక, చదువు మధ్యలో వదిలేసి స్వదేశానికి రాలేక తలలు పట్టుకుంటున్నారు. అమెరికాలో చదవాలంటే దాదాపు రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుండగా, చాలామంది అప్పు చేసే అక్కడికి వెళ్తున్నారు.
Similar News
News October 30, 2025
రేపు స్కూళ్లకు సెలవు ఉంటుందా?

తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. APలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని వరంగల్, హనుమకొండ, కరీంనగర్, సిద్దిపేట, జనగామ జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రభావం తగ్గలేదు. దీంతో రేపు కూడా స్కూళ్లకు సెలవు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
News October 30, 2025
నేడు ఈ చెట్టు కింద భోజనం చేస్తే..

నేడు కార్తీక శుద్ధ నవమి. విష్ణువు కూష్మాండుడు అనే రాక్షసుడిని ఇదే రోజు సంహరించాడని పురాణాల వాక్కు. అందుకే కూష్మాండ నవమి అని కూడా అంటారు. ఈ రోజున లక్ష్మీనారాయణులను ఉసిరి చెట్టు వద్ద ఆవాహన చేసి పూజిస్తారు. ఉసిరి చెట్టు కింద జగద్ధాత్రి పూజ చేసి, విష్ణు సహస్ర నామం, కనకధారా స్తోత్రం వంటివి పఠించడం అత్యంత శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. దీని వలన కీర్తి, జ్ఞానం, సంపదలు వృద్ధి చెందుతాయని అంటున్నారు.
News October 30, 2025
CSIR-IICTలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

హైదరాబాద్లోని CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో 7 సైంటిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్డీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.iict.res.in/


