News March 18, 2024

నేడు రెండో రోజు కవితను విచారించనున్న ఈడీ

image

TG: ఎమ్మెల్సీ కవితను ఇవాళ రెండో రోజు ఈడీ విచారించనుంది. నేడు విచారణకు రావాల్సిందిగా కవిత భర్త అనిల్‌తో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బందిలో ముగ్గురికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సీజ్ చేసిన ఫోన్లను ఓపెన్ చేయడంతో పాటు మద్యం పాలసీకి సంబంధించిన పలు అంశాలపై వారిని ప్రశ్నించనున్నట్లు సమాచారం. మరోవైపు నిన్న కవితను కలిసిన కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీలోనే ఉన్నారు.

Similar News

News October 30, 2025

నలభైల్లో జీవితంపై ఓ స్పష్టత.. మీరేమంటారు?

image

ఏ వ్యక్తికైనా నలభైల్లో జీవితంపై ఓ స్పష్టత వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వయసులో మానసిక రోగాలు, వ్యసనాలు దాదాపు కుదుటపడతాయి. వైవాహిక జీవితంలో భాగస్వామితో అవగాహన పెరుగుతుంది. ఆస్తి, అప్పులు సర్దుబాటు అవుతాయి. కొత్త స్నేహాలు, అక్రమ సంబంధాల ఒత్తిడి తగ్గుతుంది. రాజకీయాలు, బంధుత్వాలు, శత్రువులు వంటి విషయాలపై ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. వ్యక్తిగత లక్ష్యాల కంటే కుటుంబ లక్ష్యాలకు ప్రాధాన్యత ఇస్తారు.

News October 30, 2025

కాలుష్యం కాటుతో ఇండియాలో 17 లక్షల మంది మృతి

image

పెట్రోల్, డీజిల్ వంటి వినియోగంతో వెలువడుతున్న కాలుష్యానికి ప్రపంచవ్యాప్తంగా 2022లో 25 లక్షల మంది బలైనట్లు ‘ది లాన్సెట్’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఒక్క ఇండియాలోనే 17 లక్షల మంది మరణించినట్లు వివరించింది. 2010తో పోలిస్తే మరణాలు 38% పెరిగినట్లు పేర్కొంది. ఈ ఇంధన వాడకం 2016 కన్నా 21% పెరిగిందని తేల్చింది. ఢిల్లీ వంటి చోట్ల కాలుష్యం స్థాయులు పెరుగుతుండడంతో ఈ రిపోర్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది.

News October 30, 2025

సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

image

సైనిక్ స్కూళ్లలో 6వ, 9వ తరగతిలో 2026-27 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. ఇవాళ్టితో ముగియనున్న గడువును నవంబర్ 9వ తేదీ వరకు పెంచారు. ఫీజు చెల్లింపునకు నవంబర్ 10 వరకు, తప్పుల సవరణకు 12-14 తేదీల్లో అవకాశం కల్పించారు. అర్హత పరీక్ష వచ్చే ఏడాది జనవరి 18న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుంది.