News March 13, 2025

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం

image

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం ఐదు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్ వేశారు. దీంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

Similar News

News December 19, 2025

PMUYతో ప్రతి గ్యాస్ కనెక్షన్‌పై ₹300 రాయితీ: CBN

image

AP: రాష్ట్రంలోని 65.40 లక్షల LPG కనెక్షన్లను ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పరిధిలోకి తీసుకురావాలని CM CBN కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కోరారు. దానివల్ల సిలిండర్‌పై లబ్ధిదారుకు ₹300 రాయితీ లభిస్తుందని చెప్పారు. గ్యాస్ పైప్ లైన్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్కులను పెంచాలన్నారు. నెల్లూరు జిల్లాలో ₹96,862 CRతో ఏర్పాటయ్యే BPCL గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు.

News December 19, 2025

భారత్‌ను రెచ్చగొట్టే ప్లాన్‌తోనే దాడి: బంగ్లాదేశ్ మాజీ మంత్రి

image

బంగ్లాదేశ్‌లో భారత డిప్యూటీ హై కమిషనర్ ఇంటిపై ప్లాన్ ప్రకారమే దాడి చేశారని హసీనా సర్కారులో విద్యా మంత్రిగా చేసిన మొహిబుల్ హసన్ చౌదరి ఆరోపించారు. ఎన్నికలు వాయిదా వేయాలనే ఉద్దేశంతో మధ్యంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న యూనస్ దేశంలో హింసను ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. కింది స్థాయి పొలిటికల్ వర్కర్లను తొక్కేయాలని చూస్తున్నారన్నారు. భారత్‌ను రెచ్చగొట్టాలనే ఉద్దేశం కూడా దాడుల వెనుక ఉందని ఆరోపించారు.

News December 19, 2025

ఇవాళ, రేపు జాగ్రత్త

image

TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలో ఇవాళ, రేపు సింగిల్ డిజిట్‌కు టెంపరేచర్లు చేరుతాయని అంచనా వేశారు. HYDలోని పలు ప్రాంతాల్లో 5-8 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. చలితీవ్రత పెరగనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే వారం ఇలాంటి వాతావరణమే కొనసాగే అవకాశం ఉందన్నారు.