News July 14, 2024
తమిళనాడు బీఎస్పీ చీఫ్ను హత్య చేసిన నిందితుడి ఎన్కౌంటర్

తమిళనాడులోని చెన్నైలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. రాష్ట్ర బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసులో నిందితుడు, రౌడీ షీటర్ తిరువేంగడంను పోలీసులు కాల్చిచంపారు. కస్టడీ నుంచి పారిపోవడంతో అతనిపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ నెల 5న తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్పై దుండగులు దాడి చేసి చంపిన సంగతి తెలిసిందే.
Similar News
News November 19, 2025
HYD: సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై హైకోర్టు సీరియస్

సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై సంధ్య శ్రీధర్రావు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం హైడ్రా తీరుపై సీరియస్ అయింది. కూల్చివేతలకు అనుమతి ఎవరిచ్చారని కోర్టు ప్రశ్నించింది. ‘కోర్టు ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదు’ అని హైడ్రాను నిలదీసింది. ఈ కేసు తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.
News November 19, 2025
ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్?

TG: BCలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించడంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. 50%లోపు రిజర్వేషన్లతో డెడికేటెడ్ కమిషన్ 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత రిజర్వేషన్లను ఫైనల్ చేసి గెజిట్ జాబితాను ECకి అందిస్తారు. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. DEC 25లోగా 3 విడతల్లో ఎలక్షన్స్ పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
News November 19, 2025
బంధంలో సైలెంట్ కిల్లర్

కొంతమంది మాట్లాడకుండా కూడా వేధిస్తుంటారు. దీనినే స్టోన్ వాలింగ్ అంటారు. వీరు ఇతరులతో పెద్దగా మాట్లాడరు. సీరియస్గా మాట్లాడుతున్నా కూడా సమాధానం చెప్పకుండా ముభావంగా ఉండడమో, మధ్యలోనే వెళ్లిపోవడమో చేస్తుంటారు. కొందరు అక్కర్లేని విషయాల గురించి ప్రస్తావిస్తుంటారు. కొన్నిసార్లు అసలు విషయం చెప్పకుండా ఆరోపణలు చేస్తుంటారు. ఇలాంటివారు తమ చేష్టలతో జీవిత భాగస్వామికి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తారు.


