News June 7, 2024
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న హీరోయిన్ సునయన

టాలీవుడ్ హీరోయిన్ సునయన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవల తనకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు సోషల్ మీడియాలో వెల్లడిస్తూ, రింగులు మార్చుకున్న ఫొటోను షేర్ చేశారు. అయితే కాబోయే భర్త ఎవరనేది బయటపెట్టలేదు. కుమార్VSకుమారి, టెన్త్ క్లాస్, రాజ రాజ చోర తదితర తెలుగు చిత్రాలతో పాటు తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లో సునయన నటించారు. ఇన్‌స్పెక్టర్ రిషి, మీట్ క్యూట్, చదరంగం వెబ్‌సిరీస్‌లలోనూ కీలక పాత్రలు పోషించారు.
Similar News
News September 12, 2025
కాకినాడ మత్స్యకారులు విడుదల

AP: కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది. గూగుల్ నావిగేషన్ తప్పుగా చూపించడంతో ఈ నలుగురు ఆగస్టు 4న శ్రీలంక జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో శ్రీలంక కోస్ట్ గార్డ్ వీరిని అదుపులోకి తీసుకుంది. భారత ప్రభుత్వం విజ్ఞప్తితో ఈ నలుగురిని విడుదల చేసింది. దీంతో జాలర్లు మరో 2 రోజుల్లో సముద్రమార్గం ద్వారా కాకినాడకు చేరుకోనున్నారు.
News September 12, 2025
తేజా సజ్జ ‘మిరాయ్’ పబ్లిక్ టాక్

కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘మిరాయ్’లో తేజా సజ్జ, మంచు మనోజ్ నటనతో మెప్పించారని ప్రీమియర్స్ చూసిన ఫ్యాన్స్ SMలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కథా నేపథ్యం, విజువల్స్, BGM ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. కొన్ని సీన్లు గతంలో చూసిన మాదిరిగా అనిపిస్తాయని, క్లైమాక్స్ మెరుగ్గా ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కాసేపట్లో Way2News రివ్యూ&రేటింగ్.
News September 12, 2025
ఈ నెల 16 నుంచి MBBS, BDS కౌన్సెలింగ్

TG: MBBS, BDS ప్రవేశాల కోసం ఈ నెల 16 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటిస్తూ కాళోజీ హెల్త్ వర్సిటీ షెడ్యూల్ విడుదల చేసింది. 15న జనరల్ మెరిట్ లిస్టును వెబ్‌సైట్‌లో పెట్టనుండగా, ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ 16న ప్రారంభవుతుంది. 17-19 తేదీల్లో వెబ్ ఆప్షన్స్, 20-24 తేదీల్లో కాలేజీల్లో రిపోర్టింగ్, 2nd ఫేజ్‌లో 26-28 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు, 29న కాలేజీల్లో రిపోర్టింగ్ ఉంటుంది.