News February 25, 2025
దుర్మార్గుడు.. ఐదుగురిని హత్య చేశాడు

కేరళలోని తిరువనంతపురంలో 23 ఏళ్ల అఫన్ అనే యువకుడు కొన్ని గంటల వ్యవధిలోనే ఐదుగురిని హత్య చేశాడు. వీరిలో తన తమ్ముడు, నానమ్మ, ఆంటీ, అంకుల్‌తో పాటు ప్రియురాలు కూడా ఉంది. ఆ దుర్మార్గుడు తల్లిపైనా దాడి చేయగా ఆమె ఆసుపత్రిలో చావుతో పోరాడుతోంది. హత్యల అనంతరం నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. తానూ విషం తాగానని చెప్పడంతో షాకైన పోలీసులు అతడిని ఆసుపత్రిలో చేర్చారు. హత్యలకు కారణాలపై విచారిస్తున్నారు.
Similar News
News February 25, 2025
గర్భిణులు, బాలింతలు జాగ్రత్త!

AP: ‘జనని సురక్ష యోజన’ పథకం ద్వారా సాయం చేస్తామని గర్భిణులు, బాలింతలకు ఫేక్ లింక్‌లు, మెసేజ్‌లు పంపి సైబర్ నేరగాళ్లు డబ్బు కాజేస్తున్నారు. ఇలా కొందరు మోసపోతున్నట్లు బాపట్ల SP తుషార్ డూడీ వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం ఇచ్చారు. కేటుగాళ్లు తొలుత అంగన్వాడీ, ANMల వివరాలు సేకరించి ఆపై బాలింతలు, గర్భిణుల ఫోన్ నంబర్లు రాబడుతున్నారు. వాళ్ల వాట్సాప్ నంబరుకు CM ఫొటో పెట్టుకొని నమ్మిస్తూ మోసం చేస్తున్నారు.
News February 25, 2025
మూడోరోజు.. ఇంకా లభించని ఆచూకీ

TG: SLBC టన్నెల్‌లో 8 మంది కార్మికులు చిక్కుకొని మూడురోజులు అవుతున్నా వారి ఆచూకీ లభించలేదు. అసలు వారు ప్రాణాలతో ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టన్నెల్‌లో భారీగా ఊట నీరు వస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. బురద మరింత పేరుకుపోతోంది. లోపలికి వెళ్లాలని ప్రయత్నిస్తుండగా మట్టి పెళ్లలు విరిగిపడుతున్నాయి. ర్యాట్ హోల్ మైనర్స్ కూడా బురద లోంచి లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
News February 25, 2025
అది ఇండియాకు అడ్వాంటేజ్: కమిన్స్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ దుబాయ్‌లోని ఒకే స్టేడియంలో అన్నిమ్యాచ్‌లు ఆడుతుండటం జట్టుకు అడ్వాంటేజ్ అని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ కమిన్స్ అన్నారు. ఇప్పటికే టీమ్ ఇండియా బలంగా ఉందని, ఈ అంశం వారికి మరింత కలిసి వస్తోందని కమిన్స్ తెలిపారు. కాగా గాయం కారణంగా కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే.