News May 3, 2024
75 వేల ఏళ్ల నాటి మహిళ ముఖాన్ని సృష్టించారు

కేంబ్రిడ్జి పురావస్తు శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. 75 వేల ఏళ్ల కిందటి మహిళ పుర్రె ఆధారంగా ఆమె ముఖాన్ని తిరిగి సృష్టించారు. నియాండర్తల్స్ జాతికి చెందిన మహిళగా ఆమెను పేర్కొన్నారు. ఈ నిర్మాణానికి ఏడాది సమయం పట్టినట్లు తెలిపారు. కాగా ఇరాక్ కుర్దిస్తాన్‌లోని షానిదార్ గుహలో ఈ పుర్రెను గుర్తించారు. 6 లక్షల ఏళ్ల క్రితం మానవ జాతి రెండు బృందాలుగా విడిపోగా అందులో ఒకటే నియాండర్తల్స్.
Similar News
News January 21, 2026
పొట్టేళ్లకు ఎండు మేత చాలా ముఖ్యం

పొట్టేళ్ల పెంపకంలో పచ్చి మేత కంటే ఎండు మేతే చాలా ముఖ్యమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ పొట్టు, ఉలవ పొట్టు, కంది పొట్టు వంటి చాలా రకాల ఎండు మేతలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొట్టేళ్లు చాలా ఇష్టంగా తింటాయి. దీని వల్ల అవి చాలా ఆరోగ్యంగా ఉంటూ, ఎక్కువ బరువు పెరుగుతాయి. అందుకే పచ్చిమేత కాస్త తక్కువైనా, ఎండు మేతను వెటర్నరీ నిపుణుల సూచనలతో సరైన పరిమాణంలో అందేలా చూసుకోవాలి.
News January 21, 2026
మేడారం నుంచి నిమిషానికి 4 బస్సులు: పొన్నం

TG: మేడారం నుంచి భక్తులు ఇళ్లకు చేరేందుకు నిమిషానికి 4 బస్సులు ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘జాతరకు RTC బస్సుల్లో 20 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. రద్దీకి తగ్గట్లు 4వేల ప్రత్యేక బస్సులు నడపనున్నాం. 50 ఎకరాల్లో ఒకేసారి 1000 బస్సులు నిలిపేలా ఏర్పాటు చేశాం. బస్సులు మేడారం నుంచి వచ్చేటప్పుడు ఖాళీగా ఉంటాయనే 50% అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నాం’ అని స్పష్టం చేశారు.
News January 21, 2026
ఊటనేల దున్నినా, మట్టి పిసికినా, ఫలితం బురదే

ఊటనేల ఎప్పుడూ నీరు ఊరుతూ ఉండే, సహజంగానే చిత్తడిగా ఉండే భూమి. ఆ నేలలో ఎంత కష్టపడి నాగలితో దున్నినా లేదా చేతులతో మట్టిని పిసికి గట్టి పరచడానికి ప్రయత్నించినా దాని స్వభావం మారదు. చివరికి మిగిలేది గట్టిపడని, వ్యవసాయానికి పనికిరాని బురద మాత్రమే. కొన్నిసార్లు కొందరి మనుషుల స్వభావాన్ని ఎంత మార్చాలని ప్రయత్నించినా అవి మారవు. దాని వల్ల మన శ్రమే వృథా అవుతుందని ఈ సామెత చెబుతుంది.


