News January 29, 2025

క్షీణిస్తోన్న ‘సూర్య’ ప్రభ

image

టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి విఫలమయ్యారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో 14 పరుగులకే వెనుదిరిగి నిరాశ పరిచారు. గత పది టీ20ల్లో 172 పరుగులే చేసి దారుణంగా విఫలమయ్యారు. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే నమోదు చేశారు. తన స్థాయికి తగ్గ ఆట ఆడటం లేదు. ఇలానే ఆడితే రోహిత్ శర్మలానే సూర్య కూడా రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వస్తాయని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.

Similar News

News November 25, 2025

కుర్రాళ్ల ఓపికకు ‘టెస్ట్’!

image

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో మన కుర్రాళ్లు తేలిపోతున్నారు. ఒకప్పుడు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ రోజుల తరబడి క్రీజులో నిలబడేవారు. బౌలర్ల సహనాన్ని పరీక్షించేవారు. కానీ ఇప్పుడున్న ప్లేయర్లు పరుగులు చేయడం అటుంచితే కనీసం గంట సేపైనా ఓపికతో మైదానంలో ఉండలేకపోతున్నారు. కోహ్లీ, రోహిత్, పుజారా, రహానేల తర్వాత టెస్టుల్లోకి వచ్చిన పంత్, నితీశ్, సుదర్శన్, జురెల్ దారుణంగా విఫలమవుతున్నారు.

News November 25, 2025

భార్య గర్భంతో ఉంటే.. భర్త ఇవి చేయకూడదట

image

భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు చేయకపోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ‘చెట్లు నరకడం, సముద్ర స్నానం చేయడం శ్రేయస్కరం కాదు. అలాగే క్షౌరం కూడా చేయించుకోకూడదు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చావు ఇంటికి వెళ్లడం మంచిది కాదు. శవాన్ని మోయడం అశుభంగా భావిస్తారు. గృహ ప్రవేశం, వాస్తు కర్మలు వంటివి కూడా చేయకూడదు. ఈ నియమాలు పాటిస్తే దీర్ఘాయువు గల బిడ్డ జన్మిస్తుంది’ అని సూచిస్తున్నారు.

News November 25, 2025

CSIR-NEERIలో ఉద్యోగాలు

image

CSIR-నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NEERI) 14 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 23వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ME, M.Tech, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://neeri.res.in