News March 26, 2025

జొమాటో, స్విగ్గీ షేర్ల పతనం.. కారణమిదే!

image

జొమాటో, స్విగ్గీ షేర్లు ఈరోజు తడబడ్డాయి. జొమాటో 5శాతం, స్విగ్గీ 1.88శాతం మేర తగ్గాయి. BoFA బ్రోకరేజీ సంస్థ వాటి రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడమే దీనిక్కారణమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. జొమాటోను ‘కొనుగోలు’ నుంచి ‘న్యూట్రల్‌’కు, స్విగ్గీని ‘కొనుగోలు’ నుంచి ‘తక్కువ ప్రదర్శన’ స్థాయికి BoFA తగ్గించింది. ఫుడ్ డెలివరీ రంగాల్లో నష్టాల ఆధారంగా డౌన్‌గ్రేడ్ చేసినట్లు ఆ సంస్థ వివరించింది.

Similar News

News November 26, 2025

పంటలలో తెగుళ్ల ముప్పు తగ్గాలంటే..

image

వేసవిలో భూమి/నేలను లోతుగా దున్ని తెగుళ్లను కలిగించే శిలీంద్రాలను నాశనం చేయవచ్చు. పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలి. పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా చూడాలి. తెగుళ్లను తట్టుకొనే రకాల విత్తనాలను ఎంచుకోవాలి. విత్తనశుద్ధి తప్పక చేసుకుంటే విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను నివారించుకోవచ్చు. వాతావరణ పరిస్థితులను బట్టి విత్తుకునే/నాటుకునే సమయాన్ని మార్చుకోవడం వల్ల తెగుళ్ల ఉద్ధృతి తగ్గుతుంది.

News November 26, 2025

నితీశ్ కుమార్ రెడ్డి.. అట్టర్ ఫ్లాప్ షో!

image

తక్కువ కాలంలోనే మూడు ఫార్మాట్లలో చోటు దక్కించుకున్న తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి ఇటీవల ఘోరంగా విఫలం అవుతున్నారు. గతేడాది ఆస్ట్రేలియాపై మెల్‌బోర్న్‌లో సెంచరీ తర్వాత అతడు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఆ సెంచరీ తర్వాత అతడి 10 ఇన్నింగ్సుల స్కోర్ 1, 0, 4, 1, 1, 30, 13, 43, 10, 0గా ఉంది. అంటే 10 ఇన్నింగ్సుల్లో 10 సగటుతో 103 రన్స్ చేశారు. అటు బౌలింగ్‌లోనూ వికెట్లు తీయలేకపోతున్నారు.

News November 26, 2025

వైరల్ అయ్యాక అసభ్యకర మెసేజ్‌లు వచ్చాయి: నటి

image

ఆకర్షణీయమైన లుక్స్‌తో సోషల్ మీడియాలో వైరలయిన తర్వాత తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు వచ్చాయని నటి గిరిజా ఓక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఆ ఇంటర్వ్యూ తర్వాత నాకు ఆఫర్లేమీ రాలేదు. కానీ చాలా మంది మెసేజ్‌లు పంపారు. ఒక అవకాశం ఇస్తే మీ కోసం ఏదైనా చేస్తానని.. వాళ్లతో గంట గడిపేందుకు రేటు ఎంతో చెప్పాలని కొందరు అభ్యంతరకర మెసేజ్‌లు పంపారు’ అని ఆమె చెప్పుకొచ్చారు.