News August 2, 2024
ఇల్లు కూలి నిద్రలోనే కుటుంబం మృతి

AP: నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. చాగలమర్రి(మ) చిన్నవంగలిలో అర్ధరాత్రి మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిద్రలోనే మృతి చెందారు. మృతుల్లో దంపతులు గురుశేఖర్ రెడ్డి, దస్తగిరమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను గ్రామస్థులు వెలికితీస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు పూర్తిగా తడిచి, శిథిలావస్థకు చేరి కూలినట్లు తెలుస్తోంది.
Similar News
News October 21, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.2,080 పెరిగి ₹1,32,770కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,900 ఎగబాకి రూ.1,21,700గా ఉంది. అటు కేజీ వెండి ధర రూ.2000 తగ్గి, ప్రస్తుతం రూ.1,88,000 పలుకుతోంది. కాగా 6 రోజుల్లో వెండి ధర రూ.18వేలు తగ్గడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 21, 2025
విడాకులకు దారితీసే 4 కారణాలివే: నిపుణులు

వైవాహిక జీవితంలో విడాకులకు దారితీసే 4 ప్రధాన అంశాలపై మానసిక నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. అవే.. సమర్థించుకోవడం, విమర్శించడం, ధిక్కారం, చెప్పింది వినకపోవడం. ‘ఈ లక్షణాలు భాగస్వాముల మధ్య దూరాన్ని పెంచి బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ నాలుగు అంశాలను నియంత్రించకపోతే వివాహ రథం విడాకులవైపు వేగంగా పయనించడం ఖాయం’ అని నిపుణులు సూచిస్తున్నారు. సామరస్యం కోసం వాటిని దూరం పెట్టాలి. Share it
News October 21, 2025
రాజ్ ఇంట్లో సమంత దీపావళి సెలబ్రేషన్స్

బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి హీరోయిన్ సమంత దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. పండగ సందర్భంగా సామ్ ఆయన ఇంటికి వెళ్లారు. రాజ్ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి బాణసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. ‘నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది’ అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా వీరు లవ్లో ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.