News August 23, 2025

బొద్దుగా ఉన్నవారే అక్కడ హీరోలు!

image

మీరు బొద్దుగా ఉన్నారని, పొట్ట ఉందని బాధపడుతున్నారా? అయితే అలాంటివారిని ఇష్టపడే చోటు ఒకటుంది. ఇథియోపియాలోని బోడి తెగలో భారీ పొట్ట ఉంటే ప్రతిష్ఠ, ఆకర్షణకు చిహ్నంగా భావిస్తారు. కయోల్ వేడుక కోసం యువకులు 6 నెలల పాటు ఒంటరిగా శారీరక శ్రమ లేకుండా ఆహారం తీసుకొని బొద్దుగా మారతారు. అందులో ఎక్కువ బొజ్జ ఉన్నవారిని విజేతగా ప్రకటించి గౌరవిస్తారు. తెగలోని వారికి వీరే హీరోలుగా మారతారు.

Similar News

News August 24, 2025

రాహుల్‌కు, కాంగ్రెస్‌కు బిహార్‌లో గౌరవం లేదు: ప్రశాంత్ కిషోర్

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, ఆయన పార్టీకి బిహార్‌లో ఎలాంటి గౌరవం లేదని జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ RJDని అనుసరిస్తుందని విమర్శించారు. బిహార్‌లోని ప్రధాన సమస్యలైన వలస, అవినీతి, విద్య వంటి అంశాల గురించి ప్రస్తావించకుండా రాహుల్, PM మోదీ ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. దీంతో ప్రజలు తన పార్టీవైపే చూస్తున్నారని చెప్పారు.

News August 24, 2025

బీసీ బిల్లును కావాలనే ఆలస్యం చేస్తున్నారు: భట్టి

image

TG: BCల రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ నుంచి రాష్ట్రపతి వద్దకు వెళ్లిందని, అక్కడ కావాలనే ఆలస్యం జరుగుతోందని Dy.CM భట్టి విక్రమార్క ఆరోపించారు. BCలకు న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఏర్పాటైన కమిటీ వివిధ అంశాలను పరిశీలించి 28వ తేదీ లోపు నివేదిక ఇస్తుందని చెప్పారు. మరోవైపు, ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి సహకరించాలని రాజకీయ పార్టీలను కోరారు.

News August 24, 2025

ఆగస్టు 24: చరిత్రలో ఈ రోజు

image

1908: స్వాతంత్ర్యోద్యమకారుడు రాజ్ గురు జననం
1923: భారతీయ పరిశోధకుడు హోమీ సేత్నా జననం
1927: అలనాటి నటి అంజలీదేవి జననం
1928: సాహితీవేత్త దాశరథి రంగాచార్య జననం
1970: సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి జననం
1989: గాయని గీతా మాధురి జననం
2019: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మరణం
* ఉక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవం