News August 29, 2024

వాడుక భాష ఉద్యమ పితామహుడు ‘గిడుగు’

image

ఆధునిక తెలుగు భాషా నిర్మాతల్లో గిడుగు రామమూర్తి ఒకరు. గ్రాంథిక భాష నుంచి తెలుగును వాడుక భాషలోకి తీసుకొచ్చారు. వాడుక భాష ఉద్యమ పితామహుడుగా పేరొందారు. వాడుక భాష సజీవమని, ప్రజల భాష అని పేర్కొన్నారు. వ్యవహారిక భాషనే అసలైన తెలుగని చెప్పారు. తెలుగు భాషకు చేసిన కృషికి గుర్తుగా ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

Similar News

News March 19, 2026

దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

image

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.

News March 19, 2026

ఒక్క రోజే రూ.10వేలు తగ్గిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర భారీగా తగ్గింది. ఇవాళ ఒక్కరోజే రూ.10 వేలు తగ్గి కిలో రూ.2,65,000 పలుకుతోంది. గత వారంతో పోల్చితే మొత్తంగా రూ.25,000 తగ్గుదల నమోదైంది. అటు <<19423062>>బంగారం<<>> ధరలు కూడా ఇవాళ తగ్గిన విషయం తెలిసిందే.

News March 19, 2026

‘డోరేమాన్’ డైరెక్టర్ కన్నుమూత

image

‘డోరేమాన్’ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారులను అలరించిన ప్రముఖ డైరెక్టర్ సుటోము షిబాయామా(84) కన్నుమూశారు. కొంతకాలంగా లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన మార్చి 6న మరణించినట్లు జపనీస్ యానిమేషన్ స్టూడియో ఆసియా-డో ప్రకటించింది. కుటుంబసభ్యుల కోరిక మేరకు ప్రైవేటుగా అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపింది. 1980 నుంచి 2004 వరకు డోరేమాన్ టీవీ యానిమేషన్ సిరీస్‌లకు ఆయన దర్శకత్వం వహించారు.