News April 11, 2025
కోనో కార్పస్ చెట్ల నరికివేత షురూ

TG: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోనో కార్పస్ చెట్ల నరికివేత ప్రక్రియను GHMC అధికారులు ప్రారంభించారు. ఈ చెట్ల పుప్పొడి రేణువులతో ప్రమాదం ఉంటుందని, ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెప్పడంతో వాటిని తొలగిస్తున్నారు. కోనో కార్పస్ చెట్లను నరికేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి సూచించారు. అలాగే జిల్లాల్లో ఉన్న ఈ చెట్లనూ తొలగించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Similar News
News October 30, 2025
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30 గంటలలోపు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News October 30, 2025
అమల్లోకి రాని 8.82 లక్షల కోర్టు తీర్పులు

కోర్టులు వరమిచ్చినా అధికారులు కరుణించలేదన్నట్లు మారింది దేశంలో తీర్పుల అమలు. న్యాయం కోసం దాఖలైన కేసులు 5CRకు పైగా ఉండగా తీర్పులు వచ్చినా అమలు కోసం ఎదురుచూస్తున్న వారు 8.82 లక్షల మంది ఉన్నారు. జిల్లా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న ఈ కేసుల్లో 39% MHలో ఉన్నాయి. TN 86148, KL 82997, AP 68137,MP 52219 కేసులున్నాయి. ఈ తీర్పులను ఆరునెలల్లో అమలయ్యేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని SC అన్ని HCలను ఆదేశించింది.
News October 30, 2025
నకిలీ మద్యం కేసు: ముగిసిన నిందితుల కస్టడీ

AP: నకిలీ మద్యం కేసులో జనార్దన్, జగన్మోహనరావు కస్టడీ ముగియగా VJA కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరి స్టేట్మెంట్లను అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు. జోగి రమేశ్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేశానని జనార్దన్ రావు చెప్పగా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఆడియో, వీడియో సైతం కోర్టుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరినీ 7 రోజుల పాటు ఎక్సైజ్, సిట్ అధికారులు ప్రశ్నించారు.


