News March 21, 2024

వలసల పర్వం మొదలైంది.. పార్టీలకు లాభం చేకూరేనా? – 1/3

image

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వలసల పర్వం మొదలైంది. 400 సీట్లు టార్గెట్‌గా పెట్టుకున్న బీజేపీ, ఈసారి గెలిచి తీరాలని అనుకుంటున్న ఇండియా కూటమినీ ఫిరాయింపులు వెంటాడుతున్నాయి. బిహార్‌లో ఒక్క సీటూ ఇవ్వలేదని RLJP చీఫ్ పశుపతి పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి NDA నుంచి వైదొలిగారు. ఈయన కాంగ్రెస్‌తో చేతులు కలిపే అవకాశం ఉంది. మరోవైపు పలువురు కీలక BJP నేతలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

Similar News

News April 19, 2025

ఈ ఏడాది చివర్లో ఇండియాకు వస్తా: మస్క్

image

ప్రధాని మోదీతో మాట్లాడటం గౌరవంగా ఉందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో పర్యటిస్తానని ఆయన రాసుకొచ్చారు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన <<16137981>>ట్వీట్‌కు<<>> ఆయన రిప్లై ఇచ్చారు. కాగా, మస్క్‌కు చెందిన టెస్లా, స్టార్‌లింక్ కంపెనీలు త్వరలో ఇండియాలో తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది.

News April 19, 2025

మరో గంటలో వర్షం

image

TG: పలు జిల్లాల్లో ఇవాళ కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహా నగరంలో నిన్నటి తరహాలోనే సాయంత్రం వాన పడొచ్చని అంచనా వేసింది. అలాగే మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మరో గంటలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది ఉపశమనం కలిగించే వార్తే అయినా అకాల వర్షాలతో జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

News April 19, 2025

చెరకు రసాన్ని నిల్వ ఉంచి తాగుతున్నారా?

image

వేసవిలో ఉపశమనం పొందేందుకు చాలా మంది చెరకు రసం తాగుతుంటారు. అయితే కొందరు చెరకు రసాన్ని నిల్వచేసి కొన్ని గంటల తర్వాత
సేవిస్తుంటారు. అలా చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గది ఉష్ణోగ్రత వద్ద స్వచ్ఛమైన చెరకు రసం ఆక్సీకరణం చెందడం 15minలో మొదలవుతుంది. ఈ రసాయనిక చర్యతో 45 ని.ల్లోనే స్వచ్ఛత కోల్పోతుందని చెబుతున్నారు. ఆక్సీకరణం నెమ్మదించాలంటే చెరకు రసంలో కొంచెం నిమ్మరసం లేదా ఐస్‌ను వాడొచ్చు.

error: Content is protected !!