News May 18, 2024

ముగిసిన ఐదో విడత ప్రచారం

image

ఐదో విడత పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ప్రచారం ముగిసింది. మొత్తం 8 రాష్ట్రాల్లోని 49 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎల్లుండి ఐదో విడత ఎన్నికలు జరగనున్నాయి. యూపీ, మహారాష్ట్ర, బెంగాల్, బిహార్, ఒడిశా, ఝార్ఖండ్, జమ్మూ, లద్దాక్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 25న ఆరో విడత, జూన్ 1న చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News December 22, 2024

రేపు ఉదయం 10 గం.కు..

image

AP: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. రేపు (సోమవారం) పలు దర్శన టికెట్లను టీటీడీ రిలీజ్ చేయనుంది. వచ్చే ఏడాది మార్చి నెల అంగప్రదక్షిణం టోకెన్లు రేపు ఉ.10 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచనుంది. ఎంతో పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శనం (జనవరి 10 నుంచి 19) శ్రీవాణి టికెట్లు రేపు ఉ.11 గం.కు రిలీజ్ చేయనున్నారు.

News December 22, 2024

రేపు కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కృష్ణా జిల్లాలో పర్యటిస్తారు. కంకిపాడు మండలం గొడవర్రులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలిస్తారు. ఆ తర్వాత మల్లయ్యపాలెంలో పర్యటిస్తారు. కాగా రెండు రోజులపాటు పవన్ మన్యం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడ పలు గిరిజన గ్రామాల్లో ఆయన రోడ్ల పనులకు శంకుస్థాపనలు చేశారు.

News December 22, 2024

AA ఇంటిపై దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర?: కిషన్ రెడ్డి

image

TG: రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి వెనుక కాంగ్రెస్ నేతల కుట్ర ఏమైనా ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీని లక్ష్యంగా చేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడ్డారు.