News November 20, 2024
గొడవ YCP వాళ్లతోనే.. అదానీ సంస్థతో కాదు: ఆదినారాయణరెడ్డి

AP: జమ్మలమడుగులో అదానీ పేరు చెప్పి YCP నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని BJP MLA ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. నిన్న జరిగిన గొడవ YCP వాళ్లతోనేనని, అదానీతో కాదని, ఆ సంస్థను జమ్మలమడుగుకు స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఏర్పాటుకాని అదానీ పరిశ్రమకు సబ్ కాంట్రాక్టర్లుగా చలామణీ అవుతున్న దొంగ దుకాణాలనే తమ వాళ్లు అడ్డుకున్నారని వెల్లడించారు. YCP కంపెనీలను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
Similar News
News November 24, 2025
RECORD: ఎకరం రూ.137 కోట్లు

TG: హైదరాబాద్ కోకాపేట్లో భూములు రికార్డు ధర పలికాయి. నియోపొలిస్లో ప్లాట్ నం.17, 18లకు HMDA ఈ-వేలం నిర్వహించింది. ప్లాట్ నం.18లో ఎకరం భూమి రూ.137 కోట్లు, ప్లాట్ నం.17లో ఎకరం భూమి రూ.136.25 కోట్లు పలికింది. మొత్తం 9.9 ఎకరాలకు గాను HMDA రూ.1,355 కోట్లు దక్కించుకుంది. డిసెంబర్ 9న ప్లాట్ నం.19కు ఈ-వేలం జరగనుండగా ఎకరం రూ.150 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.
News November 24, 2025
‘Gambhir Go Back’.. నెటిజన్ల ఫైర్

గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక టీమ్ ఇండియా ఆటతీరు దిగజారిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. స్వదేశంలో జరిగే టెస్టుల్లోనూ ఇంత దారుణమైన బ్యాటింగ్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ అయ్యామని, BGT సిరీస్ కోల్పోయామని గుర్తు చేస్తున్నారు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో పదేపదే మార్పులు ఎందుకని మండిపడుతున్నారు. గంభీర్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News November 24, 2025
అరటి పంట పెరుగుదల, పండు నాణ్యత కోసం

అరటి మొక్కకు కొద్దిపాటి రసాయన ఎరువులతో పాటు ఎక్కువ మొత్తంలో సేంద్రియ ఎరువులను వేయడం వల్ల మొక్క ఎదుగుదలతో పాటు పండు నాణ్యత పెరుగుతుంది. 300 గ్రాముల భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 5 కేజీల బాగా చిలికిన పశువుల ఎరువుతో కలిపి మొక్కలకు అందించాలి. 45 సెం.మీ పొడవు, వెడల్పు, లోతుతో గుంతలు తీసి అందులో ఈ ఎరువును వెయ్యాలి. భాస్వరం ఎరువులు పంట మొదటి దశలోనే అవసరం. తర్వాతి దశలో అవసరం ఉండదు.


