News March 23, 2024

మా జీవితాల్ని మలుపు తిప్పిన చిత్రమది: మారుతి

image

తమ జీవితాల్ని మార్చిన సినిమా ‘ఈ రోజుల్లో’ అని దర్శకుడు మారుతి అన్నారు. అప్పట్లో పరిమిత వ్యయంతో సరదాగా చేసిన ఈ సినిమా.. సాంకేతికంగా పరిశ్రమలో స్ఫూర్తి నింపిందని అన్నారు. పన్నెండేళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడిగా తన జీవితాన్ని మలుపు తిప్పిన ఈ చిత్రం ఓ మధుర జ్ఞాపకమని చెప్పుకొచ్చారు. కాగా ఇవాళ ఈ సినిమా రీరిలీజ్ కానుంది.

Similar News

News July 8, 2024

పీరియడ్స్ సెలవులు.. సుప్రీంకోర్టు ఏమందంటే?

image

మహిళా ఉద్యోగులకు పీరియడ్స్ సెలవులు ఇవ్వడం మంచి నిర్ణయమే అయినా దీనివల్ల వారికి ఉద్యోగావకాశాలు తగ్గిపోవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈమేరకు పీరియడ్స్ సెలవులు తప్పనిసరి చేయాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసింది. అది విధానపర నిర్ణయమని, అందులో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. బిహార్‌ ప్రభుత్వం మహిళలకు నెలకు 2 రోజుల పీరియడ్ లీవ్స్ ఇస్తుండగా కేరళ సర్కార్ విద్యార్థినులకు 3 రోజుల సెలవులు ప్రకటించింది.

News July 8, 2024

ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాలు విడుదల

image

TG: గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాలను TGPSC విడుదల చేసింది. తెలంగాణ విద్యా విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సహా మరికొన్ని విభాగాల్లో అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కాయి. సరైన అభ్యర్థులు లేక 16 ఉద్యోగాలు, కోర్టు కేసులతో 19, వేర్వేరు కారణాలతో మరికొన్ని ఉద్యోగాల భర్తీ నిలిచిపోయింది. ఫలితాల కోసం <>ఇక్కడ <<>>క్లిక్ చేయండి.

News July 8, 2024

‘కల్కి’ సినిమా అద్భుతం: మహేశ్ బాబు

image

‘కల్కి 2898 AD’ సినిమాపై సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. ‘సినిమా చూసి మతిపోయింది. అద్భుతంగా ఉంది. నాగ్ అశ్విన్ విజన్‌కు హ్యాట్సాఫ్. అమితాబ్ స్క్రీన్ ప్రజెన్స్‌ను ఎవరూ మ్యాచ్ చేయలేరు. కమల్ ఏ క్యారెక్టర్ చేసినా దానికి ప్రత్యేకత తీసుకొస్తారు. ప్రభాస్ మరో గొప్ప సినిమాను అవలీలగా చేసేశారు. దీపిక ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. వైజయంతి సంస్థకి, మూవీ టీమ్‌కు కంగ్రాట్స్’ అని ట్వీట్ చేశారు.