News April 14, 2024

మిగిలిన మూడు సీట్లపై నేడు తుది ప్రకటన!

image

TG: ఇప్పటికే 14 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ నేడు మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలపై కాంగ్రెస్ గతకొంతకాలంగా తర్జనభర్జన పడుతోంది. నేడు జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశం అనంతరం దీనిపై తుది ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం గం.6.30కు శంషాబాద్‌లోని నోవాటెల్‌లో ఈ మీటింగ్ జరగనుంది.

Similar News

News January 18, 2026

WC మ్యాచెస్‌పై ICCకి బంగ్లా మరో రిక్వెస్ట్

image

T20WC మ్యాచెస్ కోసం భారత్ వెళ్లేదిలేదని బంగ్లాదేశ్ ICCకి తేల్చి చెప్పింది. పలు చర్చల తర్వాత కూడా తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాల్సిందే అంటోంది. దీనిపై వచ్చే వారం ICC తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే ICCకి BCB కొత్త రిక్వెస్ట్ పెట్టింది. ఐర్లాండ్‌తో గ్రూపులు స్వాప్ చేసుకుంటామని చెప్పింది. ఐర్లాండ్ గ్రూప్ Bకి వస్తే, BAN గ్రూప్ Cకి వెళ్తుంది. అప్పుడు గ్రూప్ మ్యాచులు కొలంబో, పల్లెకెలెలో ఆడే వీలుంటుంది.

News January 18, 2026

సప్త సాగర యాత్ర గురించి మీకు తెలుసా?

image

చొల్లంగి అమావాస్య నాడు చొల్లంగి వద్ద సాగర సంగమ స్నానంతో సప్త సాగర యాత్ర ప్రారంభమవుతుంది. గోదావరి 7 పాయలు సముద్రంలో కలిసే 7 పుణ్య క్షేత్రాలను (చొల్లంగి, కోరంగి, తీర్థాలమొండి, నత్తల నడక, కుండలేశ్వరం, మందపల్లి/రైవా, అంతర్వేది) సందర్శించి భక్తులు స్నానాలు ఆచరిస్తారు. మాఘ శుక్ల ఏకాదశి నాడు అంతర్వేది వద్ద వశిష్ఠ నదిలో స్నానంతో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ యాత్ర చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం.

News January 18, 2026

USAలో నవీన్ హవా.. $1M+ కలెక్షన్స్‌‌లో హ్యాట్రిక్

image

‘అనగనగా ఒక రాజు(AOR)’ చిత్రంతో టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. USAలో నవీన్ హవా ఎలా ఉంటుందో ఈ చిత్రంతో మరోసారి రుజువైంది. AOR సినిమా ఇప్పటికే అమెరికాలో $1M+ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు నిర్మాణ సంస్థ పేర్కొంది. జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాలు ఈ మార్కును దాటేయగా.. తాజాగా మూడో చిత్రంతో నవీన్ పొలిశెట్టి హ్యాట్రిక్ కొట్టేశారు.