News August 5, 2024
కోర్బా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. మానవ తప్పిదమే కారణం?

AP: విశాఖ రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న కోర్బా ఎక్స్‌ప్రెస్‌లో <<13774165>>మంటలు<<>> చెలరేగడానికి మానవ ప్రమేయం, నిర్లక్ష్యమే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరెంటు వినియోగం లేనప్పుడు షార్ట్ సర్క్యూట్‌కు అవకాశం లేదంటున్నారు. ఇటీవల కాజీపేట, సికింద్రాబాద్, ఢిల్లీ స్టేషన్లలోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. చాలాసేపు ఆగిన రైళ్లలో బాత్‌రూమ్‌లు వినియోగించి సిగరెట్ తాగి ఆర్పకుండా వదిలేయడంతో మంటలు వ్యాపిస్తున్నాయి.
Similar News
News March 18, 2026
కార్డియో VS యోగా VS స్ట్రెంత్ ట్రైనింగ్.. పొట్ట తగ్గడానికి ఏది బెస్ట్?

ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయడంలో కార్డియో టాప్ అయితే, విశ్రాంతి సమయంలోనూ క్యాలరీలు ఖర్చయ్యేలా మెటబాలిజం పెంచడానికి స్ట్రెంత్ ట్రైనింగ్ అవసరం. ఇక యోగా క్యాలరీలు తక్కువగా ఖర్చు చేసినా స్ట్రెస్ హార్మోన్లను తగ్గించి పొట్ట దగ్గర కొవ్వు చేరకుండా చూస్తుంది. వీటన్నింటి కాంబినేషన్ బెస్ట్ రిజల్ట్ ఇస్తుందని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. వీటితో పాటు ప్రొటీన్ ఎక్కువగా ఉండే డైట్ తీసుకోవాలని అంటున్నారు.
News March 18, 2026
ట్రంప్‌ను లేపేస్తానన్నాడు.. అతడినే లేపేశారు!

యుద్ధంలో ఇరాన్ మరో కీలక నేతను కోల్పోయింది. ఆ దేశ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజనీని చంపేశామన్న ఇజ్రాయెల్ <<19410383>>ప్రకటనను <<>>ఇరాన్ తాజాగా ధ్రువీకరించింది. శత్రుదేశం దాడిలో లారిజనీతో పాటు అతడి కొడుకు, సెక్యూరిటీ సిబ్బంది మరణించినట్లు పేర్కొంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి అలీ లారిజనీ US, ఇజ్రాయెల్‌కు వార్నింగ్స్ ఇస్తూ వచ్చారు. ట్రంప్‌ను వదిలేదే లేదని, ఆయనను లేపేస్తామంటూ హెచ్చరించారు. ఇంతలో ఆయనే హతమయ్యారు.
News March 18, 2026
రేపే జాబ్ క్యాలెండర్.. భారీగా పోస్టులు!

AP: నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వం రేపు విడుదల చేయనుంది. 10వేలకు పైగా పోస్టులతో ఈ క్యాలెండర్‌ను మంత్రి లోకేశ్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇందులో DSC, జూనియర్ లెక్చరర్ కలిపి 3 వేల పోస్టులు, వర్సిటీల్లో 1,500 అధ్యాపక పోస్టులు, దాదాపు 600 <<19412398>>గ్రూప్-1, 2<<>> ఉద్యోగాలు, 1,000 కానిస్టేబుల్, 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్స్ ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


