News December 9, 2024
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తొలి ప్రకటన వచ్చింది ఈరోజే

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై 2009లో సరిగ్గా ఇదే రోజు కేంద్రం నుంచి తొలి ప్రకటన వెలువడింది. నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన 11 రోజుల తర్వాత ఈ ప్రకటన రావడంతో బీఆర్ఎస్ ఈరోజును ఏటా ‘దీక్షా విజయ్ దివస్’గా నిర్వహిస్తోంది. ప్రజల పోరాటాన్ని చూసి చలించి ఈ ప్రకటన చేసినట్లు కాంగ్రెస్ చెబుతోంది. 2013 OCT3న కేంద్ర క్యాబినెట్ TG స్టేట్ ఏర్పాటుకు ఆమోదం తెలపగా, 2014 జూన్ 2న రాష్ట్రం అవతరించింది.
Similar News
News November 27, 2025
వైకుంఠద్వార దర్శనం.. రిజిస్ట్రేషన్ మొదలు

AP: తిరుమలలో DEC 30 నుంచి JAN 8 వరకు కల్పించనున్న వైకుంఠద్వార దర్శనాల రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. తొలి 3 రోజులకు నేటి నుంచి DEC 1 వరకు ttdevasthanams.ap.gov.in, TTD యాప్, 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్లో ఎంపికైన భక్తుల ఫోన్లకు DEC 2న మెసేజ్లు పంపుతారు. ఈ పవిత్ర దినాల్లో స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకునేందుకు మీరూ అదృష్టాన్ని పరీక్షించుకోండి.
News November 27, 2025
RITESలో 252 పోస్టులు.. అప్లై చేశారా?

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(<
News November 27, 2025
భారీగా పెరిగిన వెండి ధర.. తగ్గిన గోల్డ్ రేటు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ సిల్వర్పై రూ.4,000 పెరిగి రూ.1,80,000కు చేరింది. కేవలం మూడు రోజుల్లోనే వెండి ధర రూ.9వేలు ఎగబాకింది. అటు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.160 తగ్గి రూ.1,27,750కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పతనమై రూ.1,17,100 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి


