News October 4, 2024

తొలి కృత్రిమ ఉపగ్రహం ‘స్పుత్నిక్-1’

image

ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1ను సోవియట్ యూనియన్ 1957లో సరిగ్గా ఇదే రోజున ప్రయోగించింది. భూమిచుట్టూ పరిభ్రమించిన ఈ శాటిలైట్ ప్రతి గంటకు 29,000km ప్రయాణించి, రేడియో సిగ్నల్స్‌ను ప్రసారం చేసింది. 22 రోజులు నిరంతరాయంగా పని చేసిన తర్వాత OCT 26న బ్యాటరీ అయిపోవడంతో స్పుత్నిక్-1 నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి. 1958 జనవరి 4న ఇది కాలిపోయి, తన కక్ష్యనుండి భూమి వాతావరణంపై పడిపోయింది.

Similar News

News November 21, 2025

బాధితులకు తక్షణమే సహాయం అందించాలి: కలెక్టర్

image

జీవో 95 ఆధారంగా బాధితులకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం అధికారులను ఆదేశించారు. గడిచిన రెండేళ్లలో 152 కేసుల్లో బాధితులకు రూ.1.44 కోట్లు చెల్లించారు. 29 కేసులు పోలీసులు దర్యాప్తులో ఉండగా, 265 కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. మూడు నెలల్లో మూడు కేసులు రాజీ అయ్యాయి, ఒక కేసులో ముద్దాయిలకు శిక్ష పడిందన్నారు.

News November 21, 2025

నరసరావుపేట: డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

పల్నాడు జిల్లాలో డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ కోసం ఈ నెల 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రవాణా అధికారి సంజయ్ కుమార్ తెలిపారు. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకంలో భాగంగా 10 లక్షల జనాభాకు ఒక డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించమన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు డీపీఆర్ నకలు, ఇతర ధ్రువీకరణ పత్రాలు నరసరావుపేట జిల్లా రవాణా అధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు.

News November 21, 2025

‘పసిడి’ పంచ్.. ఫైనల్లో గెలిచిన నిఖత్ జరీన్‌‌

image

వరల్డ్ బాక్సింగ్ కప్‌ ఫైనల్లో నిఖత్ జరీన్ విజయం సాధించారు. 51 కిలోల విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. జువాన్ యి గువో (చైనీస్ తైపీ)పై 5-0 తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేశారు. నిఖత్ గెలుపుతో ఈ టోర్నీలో భారత మహిళలు గెలిచిన గోల్డ్ మెడల్స్ సంఖ్య 5కు చేరింది. మొత్తంగా ఈ టోర్నీలో 9 గోల్డ్, 6 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్‌ను భారత్ సాధించింది.