News November 17, 2024

తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-3 పరీక్ష

image

TG: గ్రూప్-3 పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ పేపర్-1, పేపర్-2 పరీక్ష జరగగా రేపు ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్ష జరగనుంది. కాగా నిమిషం నిబంధన కారణంగా పలువురు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అధికారులు అనుమతించలేదు.

Similar News

News January 23, 2026

రేషన్ బియ్యంతోపాటు నిత్యావసరాలు: ఉత్తమ్

image

TG: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు. రేషన్ బియ్యంతోపాటు ఇతర నిత్యావసర సరుకులు అందించేందుకు యోచిస్తున్నామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇచ్చినట్లుగానే నిత్యావసరాలు కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. మరోవైపు 2025-26 వానాకాలం సీజన్‌లో 71.70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు జమ చేసినట్లు తెలిపారు.

News January 23, 2026

పెరటి కోళ్ల పెంపకం.. ఈ జాతులతో అధిక ఆదాయం

image

కోళ్ల పెంపకం నేడు ఉపాధి మార్గంగా మారింది. మేలైన జాతి రకాలతో మంచి ఆదాయం సాధించవచ్చు. పెరటి కోళ్ల పెంపకానికి స్వర్ణధార, గ్రామ ప్రియ, శ్రీనిధి రకాలతో మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇవి అధిక మాంసోత్పత్తి, గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెంది, ఎక్కువ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. ఈ కోళ్ల జాతులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.

News January 23, 2026

భాగ్యనగరానికి మరో ‘అమృత్ భారత్’.. రూట్ మ్యాప్ ఇదే!

image

TG: చర్లపల్లి – తిరువనంతపురం మధ్య కొత్త అమృత్ భారత్ 2.0 ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. PM మోదీ శుక్రవారం దీన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ ప్రతి మంగళవారం ఉదయం 7.15కి చర్లపల్లిలో బయలుదేరి బుధవారం మధ్యాహ్నం కేరళ చేరుకుంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది. అమృత్ భారత్‌లో RAC టికెట్లు ఉండవు.