News October 10, 2025
తొలి రోజు ముగిసిన ఆట

వెస్టిండీస్‌తో ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు భారత్ ఆట 318/2 వద్ద ముగిసింది. ఇవాళ మూడు సెషన్లలోనూ భారత్‌దే డామినెన్స్ కనిపించింది. జైస్వాల్ (173) డబుల్ సెంచరీ వైపు దూసుకెళ్తుండగా, సాయి సుదర్శన్ (87) సెంచరీ మిస్ చేసుకున్నారు. రాహుల్ 38 పరుగులు చేసి ఔటయ్యారు. క్రీజులో జైస్వాల్‌తో పాటు గిల్(20) ఉన్నారు. వెస్టిండీస్ బౌలర్లతో వారికన్ 2 వికెట్లు తీయగా, మిగిలిన వాళ్లంతా తేలిపోయారు.
Similar News
News October 10, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* ఇవాళ రాత్రి లండన్ పర్యటనకు బయల్దేరనున్న మాజీ CM YS జగన్ దంపతులు
* అమ్మాయిల సమస్యల ఫిర్యాదుకు త్వరలో ఆన్‌లైన్ పోర్టల్ తెస్తామన్న మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ
* ఆర్‌పేట సీఐపై చిందులేసిన మాజీ మంత్రి పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ విద్యాసాగర్
* చంద్రబాబు నాయకత్వంలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిపోయిందన్న మాజీ మంత్రి విడదల రజనీ
News October 10, 2025
AP క్యాబినెట్ కీలక నిర్ణయాలు

*రూ.212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోదం
*పంచాయతీ సెక్రటరీలను పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్‌లుగా మార్చేందుకు అనుమతి
*పంచాయతీల వర్గీకరణకు ఆమోదం
*13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్పు
*విశాఖలో రూ.87వేల కోట్లతో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం
*గూగుల్ డేటా సెంటర్‌కు 480 ఎకరాల భూమి కేటాయింపు
News October 10, 2025
రేపు ఉదయం లోగా వర్షాలు!

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30గంటల లోపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వానలకు ఛాన్స్ ఉందని చెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది?