News November 29, 2024
దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. త్వరలో ట్రయల్ రన్!
దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు ట్రయల్ రన్‌ను త్వరలో హరియాణాలోని జింద్-సోనిపట్ స్టేషన్ల మధ్య నిర్వహించనున్నారు. 8 కోచ్‌లు ఉండే ఈ రైలులో 2,638 మంది ప్రయాణించవచ్చు. గరిష్ఠ వేగం 110km/h ఉంటుంది. ఈ ట్రైన్ డిజైన్‌ను RDSO రూపొందించింది. ప్రస్తుతం దీనిని ‘నమో గ్రీన్ రైలు’గా పిలుస్తున్నారు. కాగా ప్రపంచంలో జర్మనీ మాత్రమే ప్రస్తుతం హైడ్రోజన్ ట్రైన్లను నడుపుతోంది.
Similar News
News November 29, 2024
వివేకా హత్య కేసు.. భాస్కర్ రెడ్డికి సుప్రీం నోటీసులు
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మిగిలిన నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లతోపాటు దీన్ని జతచేయాలని సునీత తరఫు లాయర్ కోరారు. దీంతో ఆ మేరకు సుప్రీం ఆదేశాలిచ్చింది.
News November 29, 2024
‘గేమ్ ఛేంజర్’ నుంచి వరుస అప్డేట్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి నిన్న మూడో సాంగ్ రిలీజైన విషయం తెలిసిందే. డిసెంబర్ రెండవ వారంలో నాలుగో సింగిల్ విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జనవరి తొలి వారంలో ట్రైలర్ విడుదల చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ పోర్షన్లో అంజలి- చరణ్ మధ్య ఓ మెలోడీ సాంగ్ ఉంటుందని సమాచారం.
News November 29, 2024
అమెరికాలో చదివే భారత విద్యార్థులకు అలర్ట్
అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థులతో పాటు ఇతర దేశాల స్టూడెంట్లకు అక్కడి యూనివర్సిటీలు కీలక సూచనలు చేశాయి. శీతాకాలం సెలవులకు స్వదేశానికి వెళ్లిన విద్యార్థులు ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణం చేయడానికి (జనవరి 20) ముందే USA వచ్చేయాలని మెసేజులు పంపుతున్నాయి. వ్యాలిడ్ వీసాలు ఉన్న విద్యార్థులకు ట్రంప్ విధానాలతో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా ఛాన్స్ తీసుకోకూడదని యూనివర్సిటీలు భావిస్తున్నట్లు సమాచారం.