News July 4, 2024
మంత్రివర్గ ఉపసంఘం తొలి భేటీ నేడు

AP: రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ప్రభుత్వం మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ నేడు వెలగపూడిలోని సచివాలయంలో తొలిసారి భేటీ కానుంది. ఈ ఉప సంఘానికి హోం మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షత వహిస్తారు. మంత్రులు నారా లోకేశ్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, గుమ్మడి సంధ్యారాణి ఇందులో సభ్యులుగా ఉన్నారు.
Similar News
News April 8, 2026
Whatsappలో అదిరిపోయే ఫీచర్..

వాట్సాప్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రైవసీ ఫీచర్ అందుబాటులోకి వచ్చేస్తోంది. ఇకపై మీ మొబైల్ నంబర్‌తో పనిలేకుండానే యూజర్ నేమ్ సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ ఫోన్ నంబర్ ఇతరులకు షేర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆండ్రాయిడ్, IOS యూజర్లకు దశలవారీగా ఈ సదుపాయం లభించనుంది. కొత్త వ్యక్తులతో చాట్ చేసేటప్పుడు మీ నంబర్ కనిపించదు కాబట్టి, ఇది యూజర్ల ప్రైవసీకి మరింత భద్రతను ఇవ్వనుంది.
News April 8, 2026
సెలూన్ షాపు నడిపే వ్యక్తికి రూ.70 లక్షల GST నోటీసులా?

AP: విజయవాడలో సెలూన్ షాపు నడిపే తనకు రూ.70లక్షల GST నోటీసులు వచ్చాయని శ్రీనివాసరావు అనే వ్యక్తి వాపోయారు. 40ఏళ్లుగా పంజా సెంటర్‌లో చిన్నషాపుతో జీవనం సాగిస్తున్నానని తెలిపారు. తనకు విశాఖలో ఐరన్ స్క్రాప్ వ్యాపారం ఉన్నట్లు GST అధికారులు రికార్డులు చూపిస్తున్నారని, వారి ఆదేశాలతో తన బ్యాంకు ఖాతాను నిలిపేశారని వాపోయారు. తనకు ఏ వ్యాపారం లేదని చెప్పినా అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News April 8, 2026
సీజ్‌ఫైర్ ఎఫెక్ట్.. రూ.16.59 లక్షల కోట్ల లాభం

ఇరాన్-US మధ్య <<19594903>>సీజ్‌ఫైర్<<>> దేశీయ స్టాక్ మార్కెట్లలో జోష్ నింపింది. ఉదయం నుంచి క్లోజింగ్ వరకు బుల్ జోరు కొనసాగింది. సెన్సెక్స్ 2,946 పాయింట్లు ఎగిసి 77,562 వద్ద, నిఫ్టీ 873 పాయింట్లు వృద్ధి చెంది 23,997 వద్ద ముగిశాయి. దీంతో ఇవాళ ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.16.59 లక్షల కోట్ల సంపద ఆర్జించారు. క్రూడాయిల్ ధర తగ్గడం, రెపోరేట్‌ను RBI యథాతథంగా ఉంచడం కూడా మార్కెట్లకు ప్లస్ అయింది.


