News April 17, 2024

ముగిసిన తొలి విడత ఎన్నికల ప్రచారం

image

లోక్‌సభ తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 19న 21 రాష్ట్రాల్లోని 102 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తమిళనాడులో ఒకే దశలో 39 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. తొలి విడతలో అస్సాం, మధ్యప్రదేశ్, బిహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది.

Similar News

News November 27, 2025

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఉన్నతాధికారులు

image

నల్గొండ: సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు ఐఏఎస్ అధికారిణి కొర్ర లక్ష్మీ గురువారం పలు కేంద్రాలను సందర్శించారు. నార్కట్‌పల్లి గ్రామ పంచాయతీ, చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఆమెతో పాటు కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ, ఆర్డీఓ అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.

News November 27, 2025

స్మృతి మంధానకు మద్దతుగా నిలిచిన జెమీమా

image

తండ్రి అనారోగ్యంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న స్మృతి మంధాన కోసం తోటి క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్మృతి ఫ్యామిలీకి మద్దతుగా నిలిచేందుకు బిగ్ బాష్ లీగ్ మిగతా మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఆమె ప్రాతినిధ్యం వహించే బ్రిస్బేన్ హీట్ ఈ విషయం వెల్లడించింది. స్మృతి పెళ్లి కోసం జెమీమా ఇండియాకు వచ్చారని, పెళ్లి ఆగిపోవడంతో ఫ్రెండ్‌కు సపోర్ట్ కోసం ఇక్కడే ఉంటానని తెలిపారని పేర్కొంది.

News November 27, 2025

NIT వరంగల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

image

<>NIT <<>>వరంగల్‌ 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి ఎంఏ (ఫ్రెంచ్, జర్మన్), పీహెచ్‌డీ ఉత్తీర్ణులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.70వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nitw.ac.in/