News July 31, 2024
పోలవరం తొలి దశ అంచనా రూ.31,625 కోట్లు
AP: పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయం రూ.31,625 కోట్లని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో తెలిపారు. రూ.30,436 కోట్లు ఖర్చవుతుందని 2023లో రివైజ్డ్ కాస్ట్ కమిటీ అంచనా వేసిందని, కేంద్ర జలశక్తి సవరించిన అంచనాల ప్రకారం లెక్కగట్టిందని స్పష్టం చేశారు. విభజన చట్టంలో చాలా హామీల్ని అమలుచేశామని, కొన్నింటి అమలు వివిధ దశల్లో ఉందని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 1, 2025
ఇది దేశ గతినే మార్చే బడ్జెట్: బండి సంజయ్
TG: కేంద్ర బడ్జెట్ దేశ గతినే మార్చుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమ బడ్జెట్ ఇది. బడ్జెట్‌పై విపక్షాల అనవసర విమర్శలు మానుకోవాలి. కేంద్రానికి తెలంగాణ సర్కార్ సహకరించాలి’ అని అన్నారు. అలాగే, ఇది ప్రజారంజక బడ్జెట్ అని MP DK అరుణ కొనియాడారు. రూ.12లక్షల వరకు IT కట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇది అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చే బడ్జెట్ అని చెప్పారు.
News February 1, 2025
ముగిసిన సీఎం సమీక్ష
TG: మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సుదీర్ఘంగా జరిగిన భేటీలో వివిధ శాఖలు, రంగాలకు బడ్జెట్ అవసరాలపై చర్చలు జరిపారు. నిధుల సర్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు.
News February 1, 2025
తక్కువ వడ్డీతో రూ.5లక్షల రుణం.. ఇలా చేయండి
కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని కేంద్రం రూ.3లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచింది. కౌలు రైతులు, భూ యజమాని-సాగుదారులు, వాటాదారులు, వ్యవసాయం లేదా చేపలు పట్టడం లేదా పశుపోషణ వంటి లేదా డ్వాక్రా సభ్యులు ఈ కార్డు తీసుకునేందుకు అర్హులు. వడ్డీ కేవలం 4శాతం(7శాతంలో 3% కేంద్రం రాయితీ) ఉంటుంది. 5 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. దేశంలోని ఏ బ్యాంకులోనైనా కార్డు తీసుకోవచ్చు. రూ.2లక్షలలోపు రుణానికి పూచీకత్తు అవసరం లేదు.