News June 4, 2024

తెలంగాణలో తొలి ఫలితం వచ్చేది అక్కడే!

image

TGలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో తొలి ఫలితం నేడు మ.ఒంటి గంట కల్లా నిజామాబాద్ సీటులో వెలువడనుంది. ఇక్కడ కేవలం 15రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. మరోవైపు కరీంనగర్, నల్గొండ, HYD నియోజకవర్గాల ఫలితాలు చివర్లో(24 రౌండ్లు) వచ్చే అవకాశముంది. ఇక చేవెళ్లలో 23, మల్కాజిగిరిలో 21, SEC 20, ADB 23, PDPL 21, ZHB 23, MDK 23, WGL 18, BNR 23, MHBD 22, KHM 21, MHBR 21, NGKL 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానుంది.

Similar News

News December 3, 2025

వరుసగా రెండో రోజూ పతనం.. 90 దాటిన రూపాయి

image

భారత రూపాయి వరుసగా రెండో రోజూ పతనమైంది. డాలరుతో రూపాయి మారకం విలువ 90.13కు చేరింది. మంగళవారం అత్యంత కనిష్ఠంగా 89.94 వద్దకు చేరిన రూపాయి నేడు మరింత బలహీనపడింది. 2025లో ఇప్పటివరకు 5 శాతానికిపైగా పతనమైంది. USతో ట్రేడ్‌డీల్‌పై అనిశ్చితి, ఈక్విటీల్లోంచి విదేశీ నిధుల ఉపసంహరణ, బంగారం సహా దిగుమతులకు డిమాండ్, ఇన్వెస్టర్లు షార్ట్ కవరింగ్ చేస్తుండటం రూపాయిపై ఒత్తిడి పెంచుతోందని విశ్లేషకులు తెలిపారు.

News December 3, 2025

చదరంగంలో సంచలనం సృష్టించిన బుడ్డోడు

image

MP సాగర్‌ జిల్లాకు చెందిన మూడేళ్ల సర్వజ్ఞసింగ్‌ కుశ్వాహా ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో ఫిడే ర్యాపిడ్‌ రేటింగ్ (1572) సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేవలం 3 సంవత్సరాల 7 నెలల 20 రోజుల వయసులో ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లను ఓడించాడు. స్మార్ట్‌ఫోన్‌ అలవాటు దూరం చేయాలనే ఉద్దేశంతో చెస్‌ నేర్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. గతంలో ఈ రికార్డు WBకు చెందిన అనీశ్ సర్కార్‌ (3సం.8నెలలు) పేరిట ఉండేది.

News December 3, 2025

పీఎం మోదీని కలిసిన రేవంత్

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీని కలిశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించారు. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు.