News November 15, 2024
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86!

8వ వేతన సవరణ సంఘంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గంపెడాశలతో ఉన్నారు. జీతాలు, పెన్షన్ల సవరణ కోసం కనీసం 2.86 ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై ఉద్యోగులు ఆశాభావంగా ఉన్నట్టు NC-JCM సెక్రటరీ(స్టాఫ్ సైడ్) శివ్ గోపాల్ మిశ్రా పేర్కొన్నారు. ఈ లెక్కన ప్రభుత్వ ఉద్యోగి కనీస వేతనం ప్రస్తుతం ఉన్న రూ.18 వేల నుంచి రూ.51,480కి పెరగనుంది. అదే విధంగా పెన్షన్లు కూడా రూ.9 వేల నుంచి రూ.25,740కి పెరుగుతాయని అంచనా.
Similar News
News January 29, 2026
డైనోసర్ పాదముద్ర.. లోపల మనం పడుకోవచ్చు!

పశ్చిమ ఆస్ట్రేలియాలో భారీ డైనోసర్ పాదముద్రను పరిశోధకులు గుర్తించారు. 1.7మీటర్ల (5.5ఫీట్లు) పరిమాణంలోని ఈ పాదముద్రలో సగటు మనిషి సులువుగా పడుకోవచ్చు. 130 మిలియన్ సంవత్సరాల కిందటి ఈ అడుగును గిన్నిస్ బుక్ రికార్డ్ చేసింది. కంగారూల గడ్డపై వీటి ఆనవాళ్లు కన్పించడం ఇదే తొలిసారి. దీంతో ఇంత భారీ పరిమాణంలోని ప్రాణులు అప్పట్లో ఎలా కదిలేవి, ఎలా బతికేవి? తదితర ఆసక్తికర ప్రశ్నలపై పరిశోధనలు సాగనున్నాయి.
News January 29, 2026
KCR ఫామ్ హౌస్కు బయల్దేరిన సిట్!

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో <<18991166>>నోటీసులు<<>> ఇచ్చేందుకు సిట్ అధికారులు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు బయల్దేరినట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఆయనకు నోటీసులు అందించే అవకాశముంది. ఆపై సిట్ నోటీసులపై ప్రకటన చేయనుంది. మరోవైపు రేపు సిట్ చీఫ్ సజ్జనార్ కేసీఆర్ను విచారించనున్నట్లు సమాచారం.
News January 29, 2026
ఇవాళ KCRకు సిట్ నోటీసులు?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఇవాళ సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఎర్రవల్లి ఫామ్హౌస్లోనే ఆయనకు నోటీసులు ఇచ్చి, రేపు అక్కడే సిట్ బృందం విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను సిట్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈసారి ఏకంగా కేసీఆర్ను విచారణకు పిలుస్తారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.


