News October 21, 2025
తరింపజేసే పంచమహామంత్రాలు

మనః అంటే మనసు, త్ర అంటే రక్షించేది. మనసును రక్షించేదే మంత్రం. ఇది దైవస్వరూపం. మంత్రం ఉచ్చరించినపుడు అందులో నాదబలం మనసును శాంతపరచి, ఆత్మను ఉన్నతస్థితికి తీసుకెళ్తుంది. పంచమహామంత్రాలివే..
1.ఓంనమఃశివాయ- పంచాక్షరీమంత్రం 2.ఓం నమో నారాయణాయ-అష్టాక్షరీమంత్రం 3.ఓం నమో భగవతే వాసుదేవాయ-ద్వాదశాక్షరీ మంత్రం, 4.ఓంభూర్భువఃస్వహ-గాయత్రీ మంత్రం, 5.ఓంత్రయంబకం యజామహే-మహామృత్యుంజయ మంత్రం.
Similar News
News October 21, 2025
విశాఖకు గూగుల్ రావడం జగన్‌కు ఇష్టం లేదనిపిస్తోంది: మాధవ్

AP: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును స్వాగతిస్తూ YS జగన్ కనీసం ట్వీట్ కూడా చేయలేదని BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆక్షేపించారు. గూగుల్ పెట్టుబడులు రావడం ఆయనకు ఇష్టం లేదనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దీనిద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తుంటే ఎందుకు స్వాగతించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. యువతకు మంచి అవకాశాలు రాబోతున్నాయని, డబుల్ ఇంజిన్ సర్కారు ఫలితాలు రుచిచూపిస్తున్నామని చెప్పారు.
News October 21, 2025
శ్రీశైలంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు

AP: శ్రీశైలంలో రేపటి నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసోత్సవాలు జరుగుతాయని EO తెలిపారు. కార్తీకమాసంలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. రోజూ విడతల వారీగా మల్లికార్జునస్వామి స్పర్శదర్శనం ఉంటుందని, శని, ఆది, సోమవారాల్లో కుంకుమార్చనలు నిలిపివేస్తామని వెల్లడించారు. హోమాలు, కళ్యాణాలు యథావిధిగా నిర్వహిస్తామన్నారు. అటు పుణ్యక్షేత్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
News October 21, 2025
డేంజర్: మేకప్ బ్రష్‌ను క్లీన్ చేయకపోతే..

మేకప్ వేసుకున్న తర్వాత కొందరు మహిళలు బ్రష్‌ను క్లీన్ చేయకుండా వదిలేస్తారు. కొద్ది రోజుల తర్వాత దాన్నే వాడుతుంటారు. ఇది ఎంతో ప్రమాదకరమని, టాయిలెట్ సీటు కంటే శుభ్రపరచని మేకప్ బ్రష్‌లపై ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ బ్రష్‌ను వాడటం వల్ల మొటిమలు, చికాకు వంటి కొత్త సమస్యలొస్తాయని తెలిపింది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మేకప్ బ్రష్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
#ShareIt