News April 2, 2024

నిప్పుల కుంపటి.. సెగలు కక్కుతున్న భానుడు

image

AP: పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో నేడు, రేపు వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. నంద్యాల(D) పాణ్యంలో గరిష్ఠంగా 43.7, కర్నూలు(D) నందికొట్కూరులో 43.3, గూడూరులో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Similar News

News March 16, 2026

రైతు బంధుపై ఇప్పటికీ స్పష్టత లేదు:KTR

image

TG: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గన్‌పార్క్ వద్ద రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘కేసీఆర్ హయాంలో రైతులు నాట్లు వేసే సమయానికే ‘రైతు బంధు’ ఇచ్చేవారు. ఇప్పుడు పంటలు కోతలకు వచ్చినా దిక్కులేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. రైతులకు వెన్ను పోట్లు.. రాహుల్ గాంధీకి రూ.వెయ్యి కోట్లా? ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని మోసం చేశారు. జాబ్ క్యాలెండర్ జాడే లేదు’ అని మండిపడ్డారు.

News March 16, 2026

IPL అంటే మీకు ఏం గుర్తొస్తుంది?

image

మరికొన్ని రోజుల్లో IPL సమరం మొదలవనుంది. ఈ సందర్భంగా ‘IPL అంటే గుర్తొచ్చేది ఏంటి?’ అని ‘Cricbuzz’ ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్నను ట్వీట్ చేసింది. కొందరు చివరి ఓవర్ థ్రిల్లర్లు, స్టేడియంలో కేకలు లేనిదే మజా లేదని కామెంట్స్ చేయగా.. మరికొందరు ఫిక్సింగ్, ఛీటింగ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ‘ఈసాలా కప్ నమ్దే’ స్లోగన్ లేనిదే IPL కిక్కే లేదని RCB ఫ్యాన్స్ అంటున్నారు. ఇంతకీ IPL అంటే మీకు గుర్తొచ్చేదేంటి? COMMENT

News March 16, 2026

వచ్చే ఏడాదే పోలవరం జాతికి అంకితం: CBN

image

AP: గోదావరి పుష్కరాలకు ముందే 2027లో పోలవరాన్ని జాతికి అంకితం ఇస్తామని CM CBN పునరుద్ఘాటించారు. ‘YCP పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపే ప్రయత్నం చేసింది. రాజధాని లేని రాష్ట్రంలో మూడుముక్కలాట ఆడింది. కానీ అమరావతి నిర్మాణానికి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో రైతులు భూములను త్యాగం చేశారు. వారందరూ తల ఎత్తుకునేలా రాజధాని నిర్మిస్తాం’ అని పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ సందర్భంగా స్పష్టం చేశారు.