News April 7, 2025
మాజీ రైజర్సే దెబ్బ కొట్టారు!

GT నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను మాజీ ఆటగాళ్లు గట్టి దెబ్బ తీశారు. గత సీజన్ వరకూ SRHలోనే ఉన్న వాషింగ్టన్ సుందర్ 29 బంతుల్లోనే 49 రన్స్‌తో లక్ష్య ఛేదనను సులువుగా మార్చేశాడు. అటు ఒకప్పటి రైజర్ సిరాజ్ బౌలింగ్‌లో 4 వికెట్లు తీసి హైదరాబాద్ బ్యాటింగ్ వెన్ను విరిచాడు. వీరిద్దరూ మన వద్ద ఉన్నప్పుడు ఎందుకు ఇలా ఆడలేదంటూ నెట్టింట సన్‌రైజర్స్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
Similar News
News April 9, 2025
మా బంధం సీక్రెట్ అదే: ఉపాసన

వ్యాపారాల్లో ఉన్నట్లుగానే వివాహ బంధంలోనూ భార్యాభర్తలు సమీక్ష చేసుకోవాలని మెగా కోడలు ఉపాసన ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘ఇద్దరికీ మధ్య సమస్య వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకోవాలి. బంధంలో ఎత్తుపల్లాలన్నవి సహజం. ఆ సమయంలో ఒకరినొకరు ఎలా గౌరవించుకున్నారన్నది ముఖ్యం. మేం వారానికి ఒకరోజైనా ఒకరికొకరు పూర్తి సమయాన్ని కేటాయించుకుంటాం. సమస్య ఉంటే చర్చించి పరిష్కరించుకుంటాం. అదే మా సీక్రెట్’ అని తెలిపారు.
News April 9, 2025
కొనసాగుతున్న అల్పపీడనం

AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. దీంతో ఈరోజు, రేపు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక 11న ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు ఏలూరులో 5 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో 2, గుంటూరులో 9, పల్నాడులో 2 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
News April 9, 2025
నేడు సీఎం చంద్రబాబు సొంతింటి శంకుస్థాపన

AP: CM చంద్రబాబు నేడు సొంతింటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 8.51 గంటలకు ఆయన కుటుంబీకులతో కలిసి భూమిపూజలో పాల్గొననున్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వెనుక ఈ-9 రోడ్డులో 5.25 ఎకరాల్లో ఇంటి నిర్మాణం జరగనుంది. ఓ రైతు నుంచి ఆ భూమిని కొనుగోలు చేశారు. భూమి చదును పనులు నిన్నటికి పూర్తయ్యాయి. జీ ప్లస్ వన్‌గా ఇంటిని నిర్మిస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలోపే గృహ ప్రవేశం చేసే అవకాశం ఉంది.