News September 12, 2024
కాబోయే భర్తకు రూ.30 లక్షల జీతం ఉండాలి.. డివోర్స్డ్ మహిళ పోస్ట్!

నాగ్‌పూర్‌కు చెందిన డివోర్స్డ్ మహిళ తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చేసిన ఓ ప్రకటన వైరలవుతోంది. ‘నాకు 39 ఏళ్లు. ఏడాదికి రూ.1.3లక్షలు సంపాదిస్తా. కాబోయే భాగస్వామి అవివాహితుడై ఉండాలి. ఏడాదికి రూ.30 లక్షల జీతం రావాలి. 3BHK ఫ్లాట్ ఉండాలి. నాతోపాటే నా తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఇంటి పనుల కోసం పనిమనిషిని ఉంచాలి. అత్తామామలతో ఉండలేను. వరల్డ్ టూర్‌కు తీసుకెళ్లాలి’ అని ప్రకటనలో ఉంది.
Similar News
News December 24, 2025
సోయాబీన్, మొక్కజొన్న రైతులను కేంద్రం ఆదుకోవాలి

TG: వర్షాలతో నష్టపోయిన సోయాబీన్ రైతులను ఆదుకోవాలని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. సోయా కోతదశలో వర్షాల వల్ల ADB, NRML, KMRD, SRD జిల్లాల్లో 36వేల టన్నుల పంట దెబ్బతిందని దీన్ని ధర మద్దతు పథకం(PSS) కింద కొనుగోలుకు అనుమతివ్వాలని కోరారు. మొక్కజొన్నను నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసి ఇథనాల్, డిస్టిలరీ పరిశ్రమలకు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
News December 24, 2025
ఫేక్ వెబ్సైట్లు, యాప్స్ మోసాలకు చెక్ పెట్టండిలా!

ఇంటర్నెట్లో ఫేక్ వెబ్సైట్లు, యాప్స్ ద్వారా జరిగే స్కామ్స్ పెరిగిపోతున్నాయి. తక్కువ ధరకే వస్తువులంటూ వచ్చే నకిలీ లింక్స్‌ని క్లిక్ చేయొద్దు. వెబ్సైట్ అడ్రస్‌లో https ఉందో లేదో చూసుకోవాలి. ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అనవసరమైన పర్మిషన్స్ అడిగితే రిజెక్ట్ చేయాలి. ప్లే స్టోర్‌లో డౌన్లోడ్స్ కంటే యూజర్ రివ్యూలనే నమ్మాలి. ఫోన్లో Google Play Protect ఆన్ చేసుకుంటే మీ డేటా, మనీ సేఫ్‌గా ఉంటాయి.
News December 24, 2025
చర్మాన్ని ఇలా హైడ్రేట్ చెయ్యండి..

కాలం ఏదైనా చర్మం ఆరోగ్యంగా, తాజాగా కనిపించడానికి తేమ కావాలి. ఎన్ని క్రీములు రాసినా, పూతలు వేసినా ప్రభావం పెద్దగా కనిపించదు. దీనికి తోడు చలిగాలికి చర్మం పొడి బారినట్లుగా, జీవం కోల్పోయినట్లుగా తయారవుతుంది. ఇలాంటప్పుడు హైడ్రేటర్లు వాడాలంటున్నారు నిపుణులు. ఇవి కణాల మధ్య నీటిని పట్టి ఉంచడంలో సాయపడతాయి. గ్లిజరిన్, హ్యాలురోనిక్ ఆసిడ్ వంటివి హైడ్రేటర్లుగా పనిచేస్తాయని సూచిస్తున్నారు.


