News July 8, 2024
టీం ఇండియా ఫ్యూచర్ వీరిదేనా..?

నిన్న జింబాబ్వేతో మ్యాచ్లో అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. రికార్డుల కోసం చూడకుండా దూకుడుగా ఆడారంటూ శర్మపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే మున్ముందు భారత ఓపెనర్లుగా అభిషేక్, జైస్వాల్ ఉంటే బాగుంటుందంటూ నెట్టింట అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ దూకుడైన ఆటగాళ్లే కావడంతో కలిసి ఆడితే భారత్ పవర్ ప్లే స్కోరు పరుగులు పెడుతుందని టీం ఇండియా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
Similar News
News January 31, 2026
శని త్రయోదశి: పూజా సమయమిదే..

పంచాంగం ప్రకారం.. త్రయోదశి తిథి JAN 30న 11:09 AMకే ప్రారంభమైంది. ఆ తిథి నేడు 8:26 AM వరకు ఉంటుంది. అయితే సూర్యోదయ తిథి ప్రాముఖ్యత దృష్ట్యా శనివారం రోజే ఈ పర్వదినాన్ని జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. 8:26 AMకే తిథి ముగుస్తుంది కాబట్టి ఆలోపు అభిషేకాలు, పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవచ్చని అంటున్నారు. శివారాధన వంటి పూజా కార్యక్రమాలు మాత్రం ప్రదోష వేళలో కూడా నిర్వహించవచ్చు.
News January 31, 2026
భారత్vsన్యూజిలాండ్.. నేడే ఫైనల్ టీ20

IND, NZ మధ్య ఐదో టీ20 ఇవాళ తిరువనంతపురంలో జరగనుంది. టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లో హార్దిక్, హర్షిత్ స్థానాల్లో ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ వచ్చే అవకాశముంది. సంజూ శాంసన్ తన హోమ్ గ్రౌండ్లో తొలిసారి IND తరఫున ఆడబోతున్నారు. దీంతో ఈ మ్యాచులో అయినా భారీ స్కోర్ చేస్తారేమో చూడాలి. T20 WCకి ముందు ఆడే చివరి మ్యాచ్ ఇదే కావడంతో గెలుపుతో ముగించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.
లైవ్: స్టార్స్పోర్ట్స్, హాట్స్టార్
News January 31, 2026
శని త్రయోదశి పూజ ఎలా చేయాలి?

నవగ్రహ ఆలయంలో శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నల్లని వస్త్రంలో నల్ల నువ్వులు పోసి మూటకట్టి దీపారాధన చేయాలి. తమలపాకులో బెల్లం ఉంచి నైవేద్యంగా సమర్పించాలి. వీలైతే రావి చెట్టుకు 9 లేదా 11 ప్రదక్షిణలు చేయాలి. పూజ అనంతరం నల్లని వస్త్రాలు, పాదరక్షలు లేదా ఆహారాన్ని దానం చేయాలి. శివార్చన లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని పండితులు సూచిస్తున్నారు.


