News February 25, 2025
ముగ్గురిని చంపేసిన గజరాజులు.. కుంకీ ఏనుగులు ఎక్కడ?

AP: అన్నమయ్య (D)లో నేడు ఏనుగుల దాడిలో ముగ్గురు చనిపోయారు. అటు పార్వతీపురం మన్యం(D) జియ్యమ్మవలస(M)లో రైస్ మిల్లులోని ధాన్యం, బియ్యాన్ని గజరాజులు చెల్లాచెదురు చేశాయి. దీంతో కుంకీ ఏనుగులు ఎక్కడ? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రజలకు నష్టం జరగకుండా గజరాజులను కుంకీ ఏనుగులతో తరిమేస్తామన్న ప్రభుత్వం ఏం చేస్తోందని బాధితులు నిలదీస్తున్నారు. మరో ప్రాణం పోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News February 25, 2025
మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

TG: నిరుద్యోగ మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉమెన్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ద్వారా ఉచితంగా ఈవీ ఆటో, టూ వీలర్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనుంది. 18-45 ఏళ్ల మహిళలకు 45-60 రోజుల పాటు శిక్షణ అందించనున్నట్లు పేర్కొంది. డ్రైవింగ్ నేర్చుకున్న మహిళలకు సబ్సిడీపై ఈవీ ఆటోలు అందివ్వనున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు 45 మందికి ట్రైనింగ్ ఇవ్వగా.. వచ్చే నెల 5 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ కానుంది.
News February 25, 2025
NEPను వ్యతిరేకిస్తూ బీజేపీ నేత రాజీనామా

తమిళనాడులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రగడ మరింతగా ముదురుతోంది. తాజాగా బీజేపీ నేత, నటి రంజనా నాచియార్ ఈ పాలసీని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. విద్యార్థులపై బలవంతంగా మూడు భాషలను రుద్దడం అనేది చాలా తప్పని ఆమె ట్వీట్ చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తమ రాష్ట్రంలో అమలు చేయమని సీఎం స్టాలిన్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.
News February 25, 2025
నటిపై కేరళ కాంగ్రెస్ ఆరోపణలు.. రియాక్షన్ ఇదే

న్యూఇండియా కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.18 కోట్ల లోన్ విషయంలో మోసానికి పాల్పడ్డారని కేరళ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను నటి ప్రీతి జింటా ఖండించారు. పదేళ్ల క్రితమే తాను లోన్ తీసుకొని తిరిగి చెల్లించినట్లు స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు. తన SM అకౌంట్లను తానే హ్యాండిల్ చేస్తానని, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయొద్దన్నారు. ఓ రాజకీయ పార్టీ ఇలాంటి ప్రచారం చేయడం షాక్‌కు గురిచేసిందని చెప్పారు.