News January 31, 2025
గద్దర్ అన్న నువ్వు లేని లోటు ఎన్నటికీ తీరదు: భట్టి

TG: ప్రజా గాయకుడు గద్దర్ జయంతి సందర్భంగా Dy.CM భట్టి విక్రమార్క ఆయనను స్మరించుకున్నారు. ‘సమాజంలో అసమానతల పైన ఎన్నో పోరాటాలకు ఊపిరి పోస్తివి. నీ పాటతో తెలంగాణకి ప్రాణం పోస్తివి. ప్రజా యుద్ధ నౌకగా ప్రపంచమంతా నీ పాటతో పరిచయమేర్పరుచుకొని గొప్పగా జీవించావు సోదరా. ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా ఎంతో ఆప్యాయతగా అన్నగా, ఆప్తుడిగా నన్ను నడిపించావు. నువ్వు లేని లోటు ఎన్నటికీ తీరదు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 17, 2026
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.380 పెరిగి రూ.1,43,780కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.350 ఎగబాకి రూ.1,31,800 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4వేలు పెరిగి రూ.3,10,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి
News January 17, 2026
స్త్రీ ద్వేషులకు ప్రజలు బుద్ధి చెప్పారు: కంగనా

BMC <<18877157>>ఎన్నికల్లో<<>> మహాయుతి కూటమి గెలుపుపై నటి, MP కంగనా సంతోషం వ్యక్తం చేశారు. శివసేన(ఉద్ధవ్ వర్గం)కి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ‘స్త్రీ ద్వేషులు, బెదిరింపు రాజకీయాలు చేసేవాళ్లు, నెపోటిజం మాఫియాకి జనం తగిన స్థానాన్ని కట్టబెట్టారు. నా ఇంటిని అక్రమంగా కూల్చి మహారాష్ట్రను వదిలిపొమ్మని బెదిరించారు. ఇప్పుడు వాళ్లనే జనం వదిలేశారు’ అని పేర్కొన్నారు. 2020లో ఉద్ధవ్ హయాంలో అధికారులు కంగనా ఇంటిని కూల్చారు.
News January 17, 2026
ECILలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

హైదరాబాద్లోని <


