News August 4, 2024
ఇవాళ ‘నాగార్జున సాగర్’ గేట్లు ఓపెన్

కృష్ణా నది పరివాహకంలో వరద కొనసాగుతుండడంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ నీటిమట్టం పెరిగింది. సాగర్ నిండేందుకు మరో 60 టీఎంసీలు అవసరం కాగా గేట్లు తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తగా 3లక్షల క్యూసెక్కులకు పైగా వరద సాగర్‌కు వస్తోంది.
Similar News
News December 28, 2025
ఢిల్లీకి ‘డోమ్’.. శత్రువులకు చుక్కలే

ఢిల్లీ రక్షణ కోసం కేంద్రం ‘క్యాపిటల్ డోమ్’ పేరుతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తోంది. శత్రువుల క్షిపణులు, డ్రోన్ల నుంచి నగరాన్ని కాపాడటమే దీని లక్ష్యం. DRDO అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణులు QRSAM, VL-SRSAM దీంట్లో కీలక పాత్ర పోషిస్తాయి. వినూత్న లేజర్ ఆయుధాలను కూడా వాడుతున్నారు. ఇవి డ్రోన్లను క్షణాల్లో కూల్చేస్తాయి. ఈ వ్యవస్థతో ఢిల్లీ గగనతలంలో శత్రువులు ఛేదించలేని ఒక రక్షణ వలయం ఏర్పడబోతోంది.
News December 28, 2025
ఒక్క రోజే సెలవులో 40వేల మంది టీచర్లు

TG: నిన్న ఒకే రోజు 40వేల మందికిపైగా ప్రభుత్వ టీచర్లు సెలవు పెట్టారు. 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే హాలిడేస్, ఇవాళ(28న) ఆదివారం కావడంతో శనివారం(27న) లీవ్ పెట్టారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఇయర్ ఎండింగ్ కావడంతో CLలు సద్వినియోగం చేసుకునే ఆలోచనలో కొందరు సెలవు పెట్టినట్లు సమాచారం. రాష్ట్రంలో 1.12 లక్షల మంది టీచర్లు ఉండగా నిన్న ఒక్కరోజు 33% సెలవులో ఉన్నారు. దీంతో పలు చోట్ల పాఠాలు అటకెక్కాయి.
News December 28, 2025
మహిళలూ స్త్రీ ధనం గురించి తెలుసుకోండి

పెళ్లికి ముందు, పెళ్లి సమయంలో, మహిళకు ఆమె కుటుంబం, బంధువులు, స్నేహితులు ఇచ్చే వస్తువులను స్త్రీధనం అని పిలుస్తారు. ఇందులో మహిళకు చెందిన చర, స్థిరాస్తులతో పాటు బంగారం, వెండి ఆభరణాలు ఉంటాయి. మహిళ తను సంపాదించిన డబ్బుతో చేసిన ఏవైనా పొదుపులు, పెట్టుబడులు కూడా ఆమెకే దక్కుతాయి. స్త్రీధనం అనేది మహిళకు సంబంధించిన సంపూర్ణ ఆస్తి. ✍️ స్త్రీధనం గురించి మరింత సమాచారం కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>లోకి వెళ్లండి.


