News October 31, 2024
నేను ప్రెసిడెంట్‌గా గెలిచేసరికి గాజా యుద్ధం ముగియాలి: ట్రంప్

తాను అమెరికా అధ్యక్షుడిగా గెలిచి వైట్ హౌస్‌లో అడుగుపెట్టే నాటికి గాజా యుద్ధం ముగియాలని ఆ దేశ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ మాట్లాడినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కథనాలు ప్రచురించింది. వీలైనంత త్వరగా యుద్ధానికి ముగింపు పలకాలని ఆయన సూచించినట్లు తెలిపింది. ప్రజా సంబంధాలు బలోపేతం చేసుకోవాలని ట్రంప్ చెప్పినట్లు పేర్కొంది.
Similar News
News February 2, 2026
ఇందిరమ్మ ఇళ్లు.. 4.13 లక్షల ఇళ్లకు కేంద్రం నిధులు!

TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన(PMAY) పథకం కింద 2026-27 FYలో 4.13 లక్షల ఇళ్లకు నిధులు రానున్నట్లు అధికారులు తెలిపారు. పీఎంఏవై కింద పట్టణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, గ్రామాల్లో రూ.72 వేలు అందించనుంది. కాగా ఈ పథకానికి మొత్తం రూ.5 లక్షల నగదు విడతల వారీగా అందజేస్తున్న సంగతి తెలిసిందే.
News February 2, 2026
173 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News February 2, 2026
మహిళల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లివే..

మహిళలకు వచ్చే క్యాన్సర్ వ్యాధుల్లో సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ మొదటిస్థానంలో ఉంటుంది. దీని తర్వాత స్థానం రొమ్ము క్యాన్సర్. వీటితోపాటు యూట్రస్ క్యాన్సర్, అండాశయ (ఓవేరియన్) క్యాన్సర్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. వీటిని రాకుండా ఆపలేం కానీ, రాకముందే గుర్తించి అప్రమత్తమై చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.


