News January 2, 2025
తరం మారింది! న్యూఇయర్ వేడుకల తీరూ మారింది!

న్యూఇయర్ వేడుకల తీరులో క్రమంగా మార్పు వస్తోందని విశ్లేషకులు అంటున్నారు. యూత్ తాగి తూగడమే కాదు దైవ సన్నిధిలో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొంటున్నారు. కాశీ, అయోధ్య, పూరీ, మథుర, తిరుమల, శ్రీశైలం, ఉజ్జయిని, బృందావనం వంటి పుణ్యక్షేత్రాలను DEC 31, JAN 1న లక్షల్లో సందర్శించడాన్ని ఉదహరిస్తున్నారు. AP, TG లోనూ ఆలయాలు కిటకిటలాడటం తెలిసిందే. ఇంగ్లిష్ ఇయర్ను ఇండియనైజ్ చేస్తున్నారని కొందరి మాట!
Similar News
News October 24, 2025
ఈ రోజు రాత్రి ఢిల్లీకి CM రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై చర్చించనున్నారు. దానికోసం ఈ రోజు రాత్రి దేశ రాజధానికి బయల్దేరనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు రాష్ట్ర ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. సీఎం 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.
News October 24, 2025
మల్లె సాగు – అనువైన రకాలు

మల్లె సాగుకు ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. తేలికపాటి నేలలు, ఒండ్రునేలలు, ఇసుక నేలల్లో దిగుబడి బాగుంటుంది. గుండు మల్లె, జాజిమల్లె, కాగడా మల్లె రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. గుండు మల్లెల్లో అర్క ఆరాధన, కో-2, కస్తూరి రకాలు.. జాజిమల్లెల్లో అర్క సురభి, కో-1, కో-2 రకాలు మంచి దిగుబడినిస్తాయి. పూల కోసం, నూనె తయారీకి జాజిమల్లెలు అనుకూలం. కాగడ మల్లెలు నీటి ఎద్దడిని, చీడపీడలను తట్టుకుంటాయి.
News October 24, 2025
APPLY NOW: సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్స్లో 145 పోస్టులు

కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్స్ 145 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ICAI/ICOAI/ICSIలో ఇంటర్మీడియట్/ ఎగ్జిక్యూటివ్ లెవల్లో ఉత్తీర్ణులైన CA/CS/CMS అభ్యర్థులు అర్హులు. వెబ్సైట్: https://www.mca.gov.in/ లేదా https://icsi.edu/


