News December 16, 2024
ఏడాదితో పాటు జనరేషన్ కూడా మారిపోనుంది!

మరో 15 రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే, ఈసారి ఏడాదితో పాటు జనరేషన్ కూడా మారిపోనుంది. 2025 నుంచి జనరేషన్ బీటా ప్రారంభం కానుండగా ఇది 2039 వరకు ఉంటుంది. దీంతో 2025 జనవరి 1వ తేదీ నుంచి జన్మించేవారిని ఇకపై GEN Beta అని పిలవాలి. GEN Alpha నుంచే టెక్నాలజీలో ఎన్నో మార్పులు చూసిన మనం ఇక మరిన్ని మార్పులను చూడాల్సి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంతకీ మీరు ఏ జనరేషన్?
Similar News
News December 5, 2025
చలికాలం.. నిండా దుప్పటి కప్పుకుంటున్నారా?

చలికాలం కావడంతో కొందరు తల నుంచి కాళ్ల వరకు ఫుల్‌గా దుప్పటిని కప్పుకొని పడుకుంటారు. ఇలా చేస్తే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందక రక్తప్రసరణ తగ్గి గుండెపై ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ కూడా మందగిస్తుందట. ‘దుప్పటి ముఖానికి అడ్డుగా ఉంటే CO2 లెవల్స్ పెరిగి మెదడు పనితీరుపై ఎఫెక్ట్ చూపుతుంది. O2, Co2 మార్పిడికి అడ్డంకి ఏర్పడి శ్వాసకోస సమస్యలొస్తాయి’ అని చెబుతున్నారు.
News December 5, 2025
పాక్ తొలి CDFగా ఆసిమ్ మునీర్ నియామకం

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్‌గా ఉన్న ఆసిమ్ మునీర్‌ను ఆ దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF)గా నియమిస్తూ అధ్యక్ష కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఆర్మీ స్టాఫ్ చీఫ్ పదవితో పాటు CDFగానూ ఐదేళ్ల పాటు కొనసాగుతారని చెప్పింది. అలాగే ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగించింది. వీరిద్దరికి అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ శుభాకాంక్షలు తెలిపినట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.
News December 5, 2025
రెండో దశ ల్యాండ్ పూలింగ్‌కు రైతులు సానుకూలం: నారాయణ

AP: రాజధాని అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు రైతులు సానుకూలంగా ఉన్నారని మంత్రి నారాయణ తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని CM ఆదేశించినట్లు చెప్పారు. CRDA సమావేశంలో రూ.169కోట్లతో లోక్ భవన్, రూ.163కోట్లతో జ్యుడీషియల్ భవన్‌కు పాలనా అనుమతులు ఇచ్చామన్నారు. రూ.532 కోట్లతో నేషనల్ హైవేకు అనుసంధానం చేసే సీడ్ యాక్సెస్ రోడ్డు పనులకు ఆమోదం తెలిపామని ఆయన వివరించారు.


