News July 8, 2025
తెలుగుజాతి నంబర్ వన్ కావడమే లక్ష్యం: CBN

AP: తెలుగు రాష్ట్రాల జల వివాదంపై CM చంద్రబాబు మరోసారి స్పందించారు. సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాలు బాగుపడతాయన్నారు. తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్ వన్ కావడం తన లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఆ తప్పులు సరిచేసేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నానని, 24 గంటలు సరిపోవడం లేదని వ్యాఖ్యానించారు.
Similar News
News July 8, 2025
ఈనెల 16న ఆమెకు మరణశిక్ష అమలు!

యెమెన్‌లో వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీ హత్య కేసులో కేరళ నర్సు నిమిష ప్రియకు ఈనెల 16న అక్కడి ప్రభుత్వం మరణశిక్ష అమలు చేయనుంది. 2016లో నిమిషను తన భార్యగా పేర్కొంటూ మెహదీ ఆమె పాస్‌పోర్టు లాక్కున్నాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఎలాగైనా పాస్‌పోర్ట్ తీసుకోవాలని 2017లో అతడికి నిమిష మత్తు ఇంజెక్షన్ ఇవ్వగా మోతాదు ఎక్కువై చనిపోయాడు. ఈ కేసులో అరెస్టైన ఆమెకు మరణశిక్ష పడింది.
News July 8, 2025
ఆమెతో ఇప్పటికే పెళ్లయిపోయింది: ఆమిర్ ఖాన్

బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్ తన ప్రేయసి గౌరీ స్ప్రాట్‌తో మూడో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే, ఆమెతో ఇప్పటికే పెళ్లి అయిపోయిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘మా బంధం పట్ల గౌరీ, నేనూ సీరియస్‌గా ఉన్నాం. మేము ఇప్పుడు జీవిత భాగస్వాములమయ్యాం. ఇక పెళ్లి గురించి అంటారా.. నా మనసులో నేను ఇప్పటికే ఆమెను వివాహం చేసుకున్నా. అధికారికంగా ఎప్పుడు ప్రకటించాలో త్వరలో నిర్ణయించుకుంటాం’ అని తెలిపారు.
News July 8, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹550 పెరిగి ₹98,840కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹500 పెరిగి ₹90,600 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ.1,19,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.