News January 5, 2025
4 లక్షల పాస్‌పోర్టుల జారీనే లక్ష్యం

AP:పాస్‌పోర్టుల జారీని మరింత వేగంగా, ఎక్కువ సంఖ్యలో ఇచ్చే సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ అధికారి శివ హర్ష తెలిపారు. 2024-25లో 3.23 లక్షల పాస్‌పోర్టులు అందించామని, 2025-26లో 4 లక్షల పాస్‌పోర్టులను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. VJY, TPTY పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 13 పోస్టాఫీస్ సేవా కేంద్రాల్లో రోజుకు 1800 అపాయింట్మెంట్స్ ఇస్తున్నామన్నారు.
Similar News
News December 6, 2025
హిట్ మ్యాన్@ 20,000 రన్స్

SAతో మూడో వన్డేలో రోహిత్ శర్మ కీలక మైలురాయిని చేరుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్(టెస్టు, వన్డే, T20)లో 20,000 పరుగులు చేసిన నాలుగో ఇండియన్ ప్లేయర్‌గా నిలిచారు. కేశవ్ వేసిన 14 ఓవర్ నాలుగో బంతికి సింగిల్ తీసి ఈ ఘనత సాధించారు. సచిన్(34,357), కోహ్లీ(27,910), ద్రవిడ్(24,064) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా ప్రస్తుత మ్యాచ్‌లో భారత్ నిలకడగా ఆడుతోంది. క్రీజులో జైస్వాల్(38), రోహిత్(50) ఉన్నారు.
News December 6, 2025
నెలసరి లీవ్స్.. మన రాష్ట్రంలో అమలు చేస్తారా?

TG: కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య నెలసరి ప్రయోజన బిల్లు-2024(ప్రైవేట్)ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. మహిళలకు నెలసరి సమయంలో 4 రోజుల పెయిడ్ లీవ్స్‌తో పాటు బ్రేక్స్, పనిచేసే ప్రాంతాల్లో సౌకర్యాల కల్పన, హక్కులు ఉల్లంఘిస్తే కంపెనీలకు భారీగా జరిమానాలు విధించాలని బిల్లు కోరుతోంది. ఇప్పటికే కర్ణాటక, బిహార్, ఒడిశా ప్రభుత్వాలు ఈ తరహా సెలవులు ఇస్తుండగా తెలంగాణలోనూ ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది.
News December 6, 2025
BRSపై ఏడుపు తప్ప CM చేసిందేముంది: హరీశ్

TG: CM అబద్ధాల ప్రచారంతో వాస్తవాలు మరుగున పడిపోవని, KCR చేసిన సంక్షేమాన్ని ప్రజలు మర్చిపోరని హరీశ్ రావు తెలిపారు. రెండేళ్లుగా BRSపై ఏడ్వడం తప్ప రేవంత్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ‘అనాలోచిత నిర్ణయాలతో SLBCలో 8మంది ప్రాణాలు బలిగొన్నారు. కృష్ణా నీళ్లను AP అక్రమంగా తరలించుకుపోతున్నా, DPRలు రూపొందిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఫుట్‌బాల్ ఆటపై ఉన్న శ్రద్ధ పాలనపై లేకపోవడం సిగ్గుచేటు’ అని ధ్వజమెత్తారు.


