News January 11, 2025

ఆ వ్యూహాత్మ‌క ప్రాంతాల్లో సైన్యం బలోపేతమే లక్ష్యం.. భారత్ కీలక నిర్ణయాలు

image

లద్దాక్ ప్రాంతంలో చైనా స‌రిహ‌ద్దుల్లో ఉన్న వ్యూహాత్మ‌క ప్రాంతాల్లో భారత సైన్యం మరింత బలోపేతం కానుంది. అక్కడ ర‌క్ష‌ణ సామ‌ర్థ్యాల‌ను మెరుగుప‌ర‌చ‌డానికి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ (NBWL) 11 కీలక ప్రాజెక్టులను ఆమోదించింది. టెలికం నెట్‌వర్క్ ఏర్పాటు, మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రాలు, ఇన్‌ఫ్యాంట్రీ బెటాలియన్ శిబిరాలు, ఆర్టిలరీ రెజిమెంట్ పోస్టుల ఏర్పాటు తదితర ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపింది.

Similar News

News January 9, 2026

నాణ్యత లేదని కొన్న పంటను తిరిగి పంపేశారు

image

TG: సోయాపంట విక్రయించిన రైతులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రైతులు అమ్మిన సోయా గింజల్లో నాణ్యత లేదంటూ వేలాది క్వింటాళ్ల సోయా బస్తాలను వెనక్కి తిరిగి పంపుతున్నారు. ఆ బస్తాలను తిరిగి తీసుకెళ్లాలని రైతులకు ఫోన్ చేసి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు చెప్తున్నారు. దీంతో ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి సహా ఇతర జిల్లాల్లో సోయా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

News January 9, 2026

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

image

ట్రంప్ సుంకాల వార్నింగ్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై ఇవాళ కూడా కనిపిస్తోంది. సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టపోయి 66,907 వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు కోల్పోయి 25,861 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ICICI బ్యాంక్, అదానీ పోర్ట్స్, NTPC, ట్రెంట్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, HDFC, హిందుస్తాన్ యునిలీవర్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిన్న మార్కెట్లు భారీ నష్టాల్లో ముగియడంతో రూ.7.69 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.

News January 9, 2026

అబార్షన్‌కు భర్త అనుమతి అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు

image

ప్రెగ్నెన్సీని కొనసాగించాలని మహిళను బలవంతం చేయడం ఆమె శరీరంపై దాడేనని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. దీనివల్ల ఆమె మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలిపింది. తన మాట వినకుండా భార్య 14 వారాల ప్రెగ్నెన్సీని తొలగించుకుందని భర్త(ప్రస్తుతం విడిగా ఉంటున్నారు) పెట్టిన క్రిమినల్ కేసును కొట్టేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం గర్భస్రావానికి భర్త అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది.