News October 1, 2024

3న ఓటీటీలోకి ‘ది గోట్’ మూవీ

image

వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో దళపతి విజయ్ నటించిన ది గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) మూవీ ఈ నెల 3న ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. గత నెల 5న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ రూ.450 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, జయరాం, ప్రభుదేవా కీలక పాత్రల్లో నటించారు.

Similar News

News October 17, 2025

కాంగ్రెస్, MIM అన్ని హద్దులూ దాటాయి: బండి

image

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు MIM మద్దతివ్వడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైరయ్యారు. ‘కాంగ్రెస్, MIM సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నాయి. BJP, MIM ఒక్కటేనని ప్రచారం చేసే రాహుల్ గాంధీ దీనిపై ఎందుకు మాట్లాడరు? కాంగ్రెస్ ఒవైసీ ఒడిలో కూర్చుంది. BJP ఒంటరిగా పోటీ చేస్తోంది. MIMకు పోటీ చేసే ధైర్యమే చేయలేదు. మీరేం చేసినా మేమే గెలుస్తాం. ప్రజలు ఓట్లతో జవాబిస్తారు’ అని ట్వీట్ చేశారు.

News October 17, 2025

3 రోజులు సెలవులు!

image

TG: రేపటి నుంచి స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్ ఉండటంతో ఇప్పటికే పలు విద్యాసంస్థలు శనివారం సెలవు ప్రకటించాయి. ఎల్లుండి ఆదివారం, సోమవారం దీపావళి సెలవులు రానున్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకూ వరుసగా 3 రోజులు హాలిడేస్ వచ్చాయి. మరి లాంగ్ వీకెండ్ నేపథ్యంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సెలవులు ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News October 17, 2025

రేపు ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం భేటీ

image

AP: సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రుల బృందం రేపు 12 PMకు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ఉద్యోగులకు డీఏ సహా వివిధ ఆర్థిక అంశాలపై చర్చించనున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం మంత్రులను ఆదేశించారు.