News October 2, 2024
శుభవార్త చెప్పిన BSNL

TG: వైఫై రోమింగ్ HYDలో సక్సెస్ అయినట్లు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL ప్రకటించింది. ల్యాండ్ లైన్కే ఫైబర్ టూ హోమ్ కనెక్షన్లు ఇస్తుండగా, ఇంట్లో ఉండే వైఫై యూజర్ ఐడీ, పాస్వర్డ్తో కార్యాలయంలో లేదా మరెక్కడున్నా వైఫై వాడుకోవచ్చు. FTTH టవర్ ద్వారా దేశ వ్యాప్తంగా ఈ సేవలు అందుతాయి. దీనికి సర్వత్రా బ్రాండ్ అనే పేరు పెట్టారు. త్వరలోనే దీనిని ప్రారంభించనున్నట్లు BSNL వెల్లడించింది.
Similar News
News November 28, 2025
గొర్రెల్లో బొబ్బ రోగం(అమ్మతల్లి) ఎలా గుర్తించాలి?

ఇది ఏడాదిలో ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.
News November 28, 2025
గొర్రెల్లో బొబ్బ రోగం.. ఎలాంటి చికిత్స అందించాలి?

☛ వ్యాధి సోకిన గొర్రెలను వెంటనే మంద నుంచి వేరు చేయాలి.
☛ ఆ గొర్రెలకు గంజి వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి. పచ్చి పశుగ్రాసాన్ని ఎక్కువగా ఇవ్వరాదు.
☛ బొబ్బల మీద వేపనూనె లేదా హిమాక్స్ వంటి పూత మందులను రాయాలి.
☛ వెటర్నరీ డాక్టర్ సలహాతో బాక్టీరియాను నియంత్రించడానికి యాంటీ బయాటిక్స్, డీహైడ్రేషన్ తగ్గించడానికి IV fluids లేదా ORS తరహా ద్రావణాలు ఇవ్వడం, టీకాలు అందించడం మంచిది.
News November 28, 2025
7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. BIG UPDATE

ఢిల్లీ పోలీస్ పరీక్షల(2025) తేదీలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. మొత్తం 7,565 పోస్టులు ఉన్నాయి.
*కానిస్టేబుల్ (డ్రైవర్)- డిసెంబర్ 16, 17
*కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్)- డిసెంబర్ 18 నుంచి జనవరి 6
*హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్)- జనవరి 7 నుంచి 12
*హెడ్ కానిస్టేబుల్ (అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్, TPO)- జనవరి 15 నుంచి 22.
> పూర్తి వివరాలకు ఇక్కడ <


