News January 24, 2025
వైసీపీ చేసిన మంచిని ప్రజలకు బలంగా చెప్పాలి: సజ్జల

AP: వైసీపీ చేసిన మంచిని ప్రజలకు ఇంకా బలంగా చెప్పాలని ఆపార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ నేతలతో నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. మీడియా అండతోనే అధికారంలోకి వస్తామనేది కేవలం అపోహ అని చెప్పారు. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మిసైల్స్‌లా దూసుకెళ్లాలన్నారు. టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని చెప్పారు.
Similar News
News January 21, 2026
23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ

TG: రికార్డు స్థాయిలో ఈ వారం 23 వేల మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.261.51 కోట్లు చెల్లించినట్లు హౌసింగ్ ఎండీ గౌతం తెలిపారు. ఈ మార్చికల్లా లక్ష ఇళ్లను పూర్తి చేయడంతో పాటు తదుపరి దశను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైనట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో రూ.4,351 కోట్లకు పైగా నిధులు విడుదల చేశామన్నారు.
News January 21, 2026
చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతున్నారా?

వాతావరణ మార్పుల వల్ల చర్మం తీవ్రంగా దెబ్బతింటోంది. అందుకే దాని పీహెచ్ సరిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. చర్మాన్ని రక్షిస్తూ ఎసిడిక్ ఫిల్మ్ ఉంటుంది. దాని pH 4.5- 5.5 మధ్య ఉండేలా చూసుకోవాలి. లేదంటే మొటిమలు, దద్దుర్లు, పొడిబారడం, అతిగా నూనెలు విడుదలవ్వడం, ఎగ్జిమా వంటి సమస్యలు వస్తాయి. పీహెచ్ బ్యాలెన్స్డ్ ప్రొడక్ట్స్, సన్‌స్క్రీన్ వాడాలి. స్క్రబ్బింగ్ ఎక్కువగా చేయకూడదని సూచిస్తున్నారు.
News January 21, 2026
పురుగు మందుల నాణ్యత, పంపిణీపై కేంద్రానికి సర్వాధికారాలు

ప్రస్తుతం అమలులో ఉన్న 1968, 1971 చట్ట నిబంధనల్లోని లోపాలను సవరించడం ఈ కొత్త చట్టం ప్రధాన ఉద్దేశం. ఇది అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా పురుగు మందుల నాణ్యత, పంపిణీ అధికారాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. నకిలీ మందుల నిరోధం, స్వదేశీ తయారీ ప్రోత్సాహం, జీవ పురుగు మందుల వినియోగం పెంచడం కేంద్రం లక్ష్యం. ప్రతీ పురుగు మందును పూర్తిగా పరీక్షించిన తర్వాతే మార్కెట్లోకి అనుమతిస్తారు.


