News March 18, 2024

హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్

image

AP: గ్రూప్-1(2018) మెయిన్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఈ అప్పీల్ పిటిషన్‌పై రేపు విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా మెయిన్స్ పేపర్లను రెండు సార్లు మూల్యాంకనం చేశారని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో పరీక్షను రద్దు చేసింది.

Similar News

News April 3, 2026

YELLOW ALERT: 5 రోజులు వర్షాలు!

image

TG: రాష్ట్రంలో ఎండలు, అకాల వర్షాలతో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. పలు జిల్లాల్లో 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని IMD అధికారులు వెల్లడించారు. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వానలకు ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా 4 రోజుల వర్షాల అప్డేట్ కోసం పై ఫొటోను స్వైప్ చేయండి.

News April 3, 2026

అన్నామలైకి నో టికెట్.. మైలాపూర్ నుంచి తమిళి సై పోటీ

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 27 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలైకి టికెట్ దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. పొత్తులో ఉన్న అన్నాడీఎంకేతో ఆయనకున్న విభేదాలే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మైలాపూర్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై, సాత్తూర్ నుంచి బీజేపీ స్టేట్ చీఫ్ నాగేంద్రన్ బరిలో దిగుతున్నారు.<<-se>>#ELECTIONS2026<<>>

News April 3, 2026

ఫుడ్ రేట్లు పెంచారు సరే.. మళ్లీ తగ్గిస్తారా?

image

సరిపడా వంటగ్యాస్ సిలిండర్లు దొరకట్లేదని, బ్లాక్‌లో అధిక ధరకు కొంటున్నామని చాలా హోటళ్లు ఫుడ్ రేట్లను పెంచేశాయి. ఇందులో కొంత వాస్తవం ఉంది. అయితే గ్యాస్ సంక్షోభం తీరిపోతే పెంచిన ధరలను తగ్గిస్తారా? అని సామాన్యులకు సందేహం వస్తోంది. గతంలో కరోనా సమయంలో రేట్లను పెంచారు. ఆ మహమ్మారి వదిలి సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ అవే ధరలను కంటిన్యూ చేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తారో? COMMENT?